'సరిలేరు నీకెవ్వరు' డబ్బింగ్ టైమ్.. రష్మిక మందన్న ఇంట్రెస్టింగ్ పోస్ట్
మహర్షి లాంటి భారీ సక్సెస్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో రాబోతున్న సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలవనుంది. జనవరి 11 నుంచి ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు సిద్ధమైంది. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన క్రేజీ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది.
కాగా తాజాగా 'సరిలేరు నీకెవ్వరు' నుంచి ఓ అప్‌డేట్ తెలుపుతూ సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ చేసింది రష్మిక. రోమ్‌కి వెళ్లే ముందు 'సరిలేరు నీకెవ్వరు' మూవీలో తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పోర్షన్ అంతా పూర్తయిందని పేర్కొంది రష్మిక. అదేవిధంగా త్వరలో మీ అందరినీ జనవరి 5న 'సరిలేరు నీకెవ్వరు' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కలుసుకోబోతున్నాము. సంక్రాంతికి రెడీగా ఉండండి అంటూ ట్వీట్ పెట్టింది రష్మిక మందన్న. ఈ మేరకు తాను డబ్బింగ్ చెబుతున్న పిక్ షేర్ చేసింది.

జనవరి 5న ఎంతో అట్టహాసంగా హైదరాబాద్‌లో 'సరిలేరు నీకెవ్వరు' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా చిరంజీవి రానుండటం విశేషం. మరోవైపు ఈ సినిమా విడుదల కోసం సూపర్ స్టార్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'సరిలేరు నీకెవ్వరు' మూవీ.. కామెడీ ఎంటర్‌టైనర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రంలో విజయశాంతి ముఖ్యపాత్ర పోషిస్తోంది. అలాగే ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్, బండ్ల గణేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రానికి ఘట్టమనేని మహేష్ బాబు, దిల్ రాజు, అనిల్ సుంకర నిర్మాతలుగా వ్యవిహరించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు.


Click it and Unblock the Notifications











