Rashmika Mandanna చేతుల మీదుగా పంచతంత్రం ట్రైలర్.. బ్రహ్మనందం మలుపుతిప్పే పాత్రలో
డాక్టర్ బ్రహ్మానందం, స్వాతిరెడ్డి, సముద్ర ఖని, రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, నరేష్ అగస్త్య, దివ్య ద్రిష్టి, వికాస్ ముప్పల ప్రధాన పాత్రలో నటిస్తున్న కథా సంపుటి పంచతంత్రం. టికెట్ ఫ్యాక్టరీ, ఒరిజినల్స్ పతాకాలపై అఖిలేష్ వర్దన్, సృజన్ ఎరబోలు ఈ చిత్రాన్నినిర్మించారు. హర్ష పులిపాక దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 9న గ్రాండ్‌గా రిలీజ్ కానున్నది. పంచతంత్రం సినిమా ట్రైలర్‌ను నేషనల్ క్రష్, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఆవిష్కరించారు. ఈ సినిమా విజయం సాధించాలని ఆమె శుభాకాంక్షలు అందించారు. పంచతంత్రం సినిమా కథ విషయానికి వస్తే..

'పంచతంత్రం' ట్రైలర్‌ను పరిశీలిస్తే.. ఈ సినిమా 5 జంటలకు సంబంధించిన కథ అని స్పష్టమైంది. ఈ ఐదు కథలకు పంచేద్రియాలు అని బ్రహ్మనందం పేరు పెట్టి తన కోణంలో స్టార్ట్ చేస్తారని స్పష్టమైంది. ప్రతీ ఒక్కరి జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి. సంతోషాలే కాదు.. బాధలు కూడా వస్తుంటాయి. ఆ సమస్యలను ఎలా సమర్ధవంతంగా ఎదుర్కొన్నాం అనేది కథాంశం. పంచతంత్రం ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్‌గా హార్ట్ టచింగ్ ఎమోషన్స్‌తో ముందుకు సాగుతుంది.
మన చుట్టు ఉన్న సమయంలోని వ్యక్తుల వ్యక్తిత్వాలు ప్రతీ కథలో ప్రతిబింబిస్తాయి. దర్శకుడు హర్ష వినోదాత్మకంగా, ఎమోషనల్‌గా ముందుకు తీసుకెళ్లినట్టు స్పష్టమవుతున్నది. అర్థవంతమైన సంభాషణలు ప్రతి పాత్రలోని భావోద్వేగాలను సెన్సిబుల్‌గా ఎలివేట్ చేస్తున్నాయి. ట్రైలర్‌లోని ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం, రాజ్ కే నల్లి సినిమాటోగ్రఫి సినిమాపై అంచనాలు పెంచాయి.
నటీనటులు: డాక్టర్ బ్రహ్మానందం, స్వాతి రెడ్డి, సముద్ర ఖని, రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, నరేష్ అగస్త్య, దివ్య ద్రిష్టి, వికాస్ ముప్పల తదితరులు
రచన, దర్శకత్వం: హర్ష పులిపాక
నిర్మాతలు : అఖిలేష్ వర్దన్, సృజన్ ఎరబోలు
సహ నిర్మాతలు: రమేష్ వీరగంధం, రవళ్లి కళంగి
సినిమాటోగ్రఫి: రాజ్ కే నల్లి
మ్యూజిక్: ప్రశాంత్ ఆర్ విహారి - శ్రవణ్ భరద్వాజ్
ఎడిటర్: గ్యారీ బి.హెచ్
క్రియేటివ్ ప్రొడ్యూసర్: ఉషా రెడ్డి వవ్వేటి,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: భువన్ సాలూరు
లైన్ ప్రొడ్యూసర్: సునీత్ పదోల్కర్
పబ్లిసిటీ డిజైన్స్: దినేష్ రెడ్డి
ప్రొడక్షన్ టీమ్: అభినయ్ కృష్ణ, రఘురామ్ శ్రీపాద
అసోసియేట్ డైరెక్టర్: విక్రమ్
కాస్ట్యూమ్ డిజైనర్: ఆయేషా మరియం
పీఆర్‌వో: నాయుడు సురేంద్ర కుమార్ - ఫణి కందుకూరి ( బియాండ్ మీడియా)
డిఐ అండ్ సౌండ్ మిక్సింగ్: అన్నపూర్ణ
ఆడియో: లహరి మ్యూజిక్
బానర్స్: టికెట్ ఫ్యాక్టరీ, ఒరిజినల్స్


Click it and Unblock the Notifications











