Virosh: విజయ్, రష్మిక పెళ్లికి ముగ్గురు స్టార్ డైరెక్టర్లు.. మొత్తం ఎంత మంది గెస్టులంటే?

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న పెళ్లి వ్యవహారం జాతీయ మీడియా హెడ్‌లైన్లను గత కొద్ది నెలలుగా ఆకర్షిస్తూనే ఉన్నాయి. అయితే కొన్ని సంవత్సరాలుగా డేటింగ్ చేస్తున్న ఈ ఇద్దరు స్టార్స్ తాము ఫిబ్రవరి 26వ తేదీన వివాహం చేసుకోబోతున్నట్టు తమ పెళ్లికి మూడు రోజుల ముందుగా అధికారికంగా ప్రకటించారు. దాంతో ఈ ఇద్దరి పెళ్లి వ్యవహారం ఇప్పుడు అఫీషియల్‌గా మారింది. అయితే ఉదయ్‌పూర్‌లో జరిగే పెళ్లికి సంబంధించిన కీలక విషయాల విషయానికి వస్తే..

విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరు ఫిబ్రవరి 23వ తేదీన ఉదయ్‌పూర్‌కు చేరుకొన్నారు. వారు పెళ్లి వేదికకు చేరుకోవడానికి ముందు తమ వెడ్డింగ్ కార్డును సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అయితే వీరి పెళ్లిలో జరిగే కార్యక్రమాల గురించిన విషయాల్లోకి వెళితే.. 24వ తేదీన హల్దీ, మెహందీ ఫంక్షన్ జరుగుతుంది. 25వ తేదీన సంగీత్ కార్యక్రమం ఉంటుంది. ఫిబ్రవరి 26వ తేదీ ఉదయం పెళ్లి జరుగుతుంది అని తెలిసింది.

Rashmika Mandanna Vijay Deverakonda Marriage

ఇక అత్యంత ప్రైవేట్ కార్యక్రమంగా, కేవలం ఇరు కుటుంబాలు, కొంత మంది స్నేహితుల సమక్షంలో జరిగే ఈ కల్యాణానికి సుమారుగా 200 మంది హాజరు అవుతారు. విజయ్ ఫ్యామిలీ నుంచి 100 మంది, రష్మిక మందన్న కుటుంబం నుంచి 100 మంది హాజరవుతారు. కొద్ది మంది అత్యంత సన్నిహితులు ఈ పెళ్లిలో పాలు పంచుకొంటారు అని తెలిసింది.

సినీ పరిశ్రమ నుంచి పెళ్లికి కొద్ది మందిని మాత్రమే ఆహ్వానించారు. మిగితా వారిని హైదరాబాద్ తాజ్‌ హోటల్‌లో మార్చి 4వ తేదీన జరిగే రిసెప్షన్‌కు ఆహ్వానించారు. ఈ రిసెప్షన్‌కు బాలీవుడ్, తమిళ, మలయాళ, తెలుగు సినీ ప్రముఖులు హాజరవుతారు అని తెలిసింది. మీడియాకు ప్రత్యేక మరో రోజు విందును ఏర్పాటు చేసి వ్యక్తిగతంగా అందర్ని కలుస్తారనేది తాజా సమాచారం.

అయితే విజయ్, రష్మిక వివాహానికి ముగ్గురు స్టార్ డైరెక్టర్లు ఖచ్చితంగా హాజరు అవుతున్నట్టు సమాచారం. అందులో పెళ్లిచూపులు సినిమాతో హిట్ ఇచ్చిన తరుణ్ భాస్కర్, అర్జున్ రెడ్డితో విజయ్‌ని స్టార్‌గా మార్చిన సందీప్ రెడ్డి వంగా, ఇండస్ట్రీలో మొదటి నుంచి స్నేహితుడు, కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ వివాహానికి హాజరువుతారని తెలిసింది. అయితే నాగ్ అశ్విన్ ఈ పెళ్లికి హాజరవుతారా? లేదా అనేది ఇంకా సందిగ్ధంగానే ఉంది. ఎందుకంటే ఇటీవలే కల్కి 2 సినిమా షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అమితాబ్, కమల్ హాసన్ లాంటి అగ్ర హీరోలు ఈ షూటింగులో భాగం కావడంతో ఆయన వెళ్తారా? లేదా అనేది ప్రశ్నగానే మిగిలింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X