Rashmika-Vijay Wedding Plan: రష్మిక, విజయ్ దేవరకొండ కంప్లీట్ వెడ్డింగ్ ప్లాన్.. హల్దీ, సంగీత్ ఎప్పుడంటే?
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న మ్యారేజ్ వార్త ప్రస్తుతం మీడియాలోను, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే వివాహ గడియలు సమీపిస్తున్న ఈ రెండు కుటుంబాలు మాత్రం గుంభనంగా ఉంటూ తమ పని తాము చేసుకొంటూ పోతున్నాయి. అత్యంత నిరాడంబరంగా, మీడియా, సినీ ప్రముఖుల హంగామాకు దూరంగా ఈ పెళ్లిని నిర్వహించాలని దేవరకొండ, మందన్న ఫ్యామిలీ నిర్ణయం తీసుకోవడంతో ప్రతీ విషయం సీక్రెట్‌గానే ఉంచుతున్నారు. అయితే రష్మిక, విజయ్ పెళ్లికి సంబంధించిన కార్యక్రమాల వివరాల్లోకి వెళితే..
గత కొద్ది సంవత్సరాలుగా డేటింగ్‌తో లివిన్ రిలేషన్‌షిప్‌ను కొనసాగిస్తున్న విజయ్, రష్మిక జంట ఇటీవల వివాహం చేసుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది. వారిద్దరూ రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఫిబ్రవరి 26వ తేదీన పెళ్లి చేసుకోవాలని అన్ని రకాల ఏర్పాట్లు గత నెల రోజులుగా చేస్తున్నారు. వారి పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు, ఇతర అంశాలను స్వయంగా పర్యవేక్షించడానికి పలుమార్లు ఉదయ్‌పూర్‌కు వెళ్లి రావడం కూడా జరిగింది అనేది మీడియా కథనాలు వచ్చాయి.

అయితే రష్మిక, విజయ్ పెళ్లికి సంబంధించిన రిసెప్షన్ కార్డు మీడియాలో లీక్ కావడంతో వారిద్దరి మ్యారేజ్ అఫీషియల్‌గా బయటకు వచ్చింది. అయితే రెండు కుటుంబాల మధ్య ప్రైవేట్ కార్యక్రమంగా నిర్వహిస్తున్న ఈ మ్యారేజ్‌కు ఇరు ఫ్యామిలీలకు చెందిన అతి కొద్ది మందిని మాత్రమే ఆహ్వానించినట్టు సమాచారం. మొత్తంగా 50 నుంచి 60 మంది ఈ మ్యారేజ్‌కు హాజరయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులెవరూ తమకు ఆహ్వానం అందిందని దాఖలాలు కనిపించడం లేదు అని వారి సన్నిహితులు వెల్లడిస్తున్నారు.
అయితే రష్మిక, విజయ్ పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయి. 24వ తేదీన హల్దీ, మెహందీ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆ తర్వాత 25వ తేదీ సంగీత్ ఉంటుంది. పెద్దలు, వేద బ్రహ్మణులు నిర్ణయించిన ముహుర్తం ప్రకారం 26వ తేదీన మ్యారేజ్ జరుగుతుంది అని తెలిసింది.
పెళ్లి తర్వాత ఇరు కుటుంబాలు ఉదయ్‌ఫూర్ నుంచి హైదరాబాద్‌కు చేరుకొంటారు. అనంతరం బెంగళూరు, రష్మిక సొంత గ్రామంలో జరిగే కార్యక్రమాలకు ఇరు కుటుంబాలు హాజరవుతాయి. ఆ తర్వాత విజయ్ తండ్రి గోవర్ధన్ దేవరకొండ సొంత గ్రామంలో జరిగే సత్యనారాయణ వ్రతంలో నూతన దంపతులు, ఇరు కుటుంబాలు పాల్గొంటాయి. అనంతరం మార్చి 4వ తేదీన హైదరాబాద్‌లో జరిగే రిసెప్షన్‌లో తమ స్నేహితులు, సన్నిహితులు, సినీ ప్రముఖులకు విందును ఏర్పాటు చేశారు.


Click it and Unblock the Notifications











