విజయ్ దేవరకొండ కోసం మారు వేషంలో రష్మిక .. లీక్ చేసిన టాప్ ప్రొడ్యూసర్
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నలు సీక్రెట్‌గా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఎన్నోసార్లు రెస్టారెంట్లు, ఎయిర్‌పోర్టులలో జంటగా కనిపించారు వీరిద్దరూ. కానీ తమ బంధాన్ని మాత్రం బయటపెట్టడం లేదు. ఇద్దరూ ఒకరిపై మరొకరు తమ ఇష్టాన్ని పలు సందర్భాలలో బయటపెడుతూనే ఉన్నారు. కానీ రిలేషన్‌లో ఉన్నాం అని కానీ, త్వరలోనే పెళ్లి చేసుకుంటామని కానీ చెప్పడం లేదు. తాజాగా విజయ్‌పై తన ప్రేమను, అభిమానాన్ని చాటుకున్నారు రష్మిక మందన్న.
రష్మిక - విజయ్ చెట్టాపట్టాలు
గీత గోవిందంలో తొలిసారి కలిసి నటించిన ఈ జంట అప్పటి నుంచే ప్రేమలో మునిగి తేలుతోందని ఫిలింనగర్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీలున్నప్పుడల్లా ఇద్దరూ కలిసి వెకేషన్లకు వెళ్తున్నారని పలుమార్లు రుజువు అయ్యింది. అయితే ఒకే చోట నుంచి విజయ్, రష్మికలు వేర్వేరుగా తమ సోషల్ మీడియా ఖాతాలలో ఫోటోలు, వీడియోలు షేర్ చేయడంతో నెటిజన్లు వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అయితే ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండపై తన ఇష్టాన్ని ఇన్‌డైరెక్ట్‌గా బయపెట్టింది రష్మిక మందన్న.

విజయ్‌పై ఇష్టాన్ని బయటపెట్టిన రష్మిక
నావి, విజయ్‌వి ఆలోచనలు ఒకేలా ఉంటాయని పేర్కొంది. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలలో ఇద్దరం కలిసి నటించామని.. ఇద్దరం మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వారిమేనని రష్మిక తెలిపింది. విజయ్ ఎప్పుడూ సీరియస్‌గా తన పని గురించే ఆలోచిస్తారని.. ఆయనను తాను విజ్జు అని పిలుస్తానని, విజయ్ ఇచ్చే సలహాలు మంచి ఫలితాలు ఇస్తాయని రష్మిక పేర్కొంది. ఈ పరిణామాలతో రష్మిక - విజయ్ త్వరలోనే గుడ్‌న్యూస్ చెబుతారని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడంతో విజయ్ - రష్మికకు పెళ్లయి, పిల్లలు పుట్టినట్లుగా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు.
రష్మికపై నాగవంశీ వ్యాఖ్యలు
అయితే టైం వచ్చినప్పుడు తన ప్రేమ, పెళ్లి గురించి ఖచ్చితంగా బయటపెడతానని విజయ్ దేవరకొండ తెలపగా.. రష్మిక మాత్రం ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని కరాకండీగా చెప్పేసింది. అయితే రష్మిక - విజయ్ దేవరకొండ ప్రేమ విషయాన్ని అప్పట్లోనే బయటపెట్టారు నిర్మాత, సితార ఎంటర్‌టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ. గతంలో అన్‌స్టాపబుల్ షోకు గెస్ట్‌గా వచ్చిన నాగవంశీ.. రష్మిక ఓ తెలుగు హీరోతో ప్రేమలో ఉందని, అతనినే పెళ్లి చేసుకుంటుందని హింట్ ఇచ్చాడు. తాజాగా మరోసారి రష్మిక- విజయ్ దేవరకొండ మధ్య ఉన్న సీక్రెట్‌ను లీక్ చేశారు నాగవంశీ.
మారువేషంలో రష్మిక మందన్న
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ మూవీ జూలై 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు నాగవంశీయే నిర్మాత. ఈ మూవీ ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో రష్మిక విషయం తెరపైకి వచ్చింది. కింగ్డమ్ మూవీని రష్మిక రిలీజ్ రోజు చూడాలనుకున్నారట. తొలుత హైదరాబాద్ శ్రీరాములు థియేటర్‌లో చూడాలని రష్మిక భావించారట. అయితే ఆమె వస్తున్న విషయం తెలిస్తే జనం భారీగా పొగవుతారని పోలీసులు అనుమతులు తిరస్కరించారట. దీంతో రష్మిక తనను ఎవరూ గుర్తుపట్టకుండా మారువేషంలో భ్రమరాంబ - మల్లిఖార్జున థియేటర్‌లో కింగ్డమ్ చూసినట్లు నాగవంశీ బయటపెట్టారు. దీంతో విజయ్ - రష్మిక రిలేషన్ వార్తలకు మరింత బలం చేకూరినట్లు అయ్యింది.


Click it and Unblock the Notifications











