పుష్ప 2 మూవీ 1000 టార్గెట్‌కు రష్మిక దెబ్బ కొట్టనుందా? అల్లు అర్జున్‌‌కు షాకివ్వబోతున్న నేషనల్ క్రష్!

ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర పాన్ ఇండియా లెవెల్ ప్రాజెక్ట్ లు చాలా కామన్ తెలిసిందే. అయితే చిన్న లేదు పెద్ద లేదు అంతా పాన్ ఇండియా సినిమాలు అనౌన్స్ చేసేస్తున్నారు కానీ మిడ్ రేంజ్ హీరోల సినిమాలకి ఏమో కానీ స్టార్ హీరోల పాన్ ఇండియా సినిమాల పరిస్థితి మాత్రం వేరేలా ఉంటుంది అని చెప్పాలి. ముఖ్యంగా మన తెలుగు సినిమా హీరోల సినిమాల పరిస్థితే బాగా ల్యాగ్ గా మారుతుంది.

ఎప్పుడో స్టార్ట్ చేసిన పాన్ ఇండియా సినిమాలు ఇంకా షూటింగ్ దశలోనే ఉన్నాయి. కాగా ఇలా ఉన్నప్పటికీ పాన్ ఇండియా మార్కెట్ లో మంచి హైప్ లో ఉన్న సీక్వెల్ ఏదన్నా ఉంది అంటే అది ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ గ్రాండ్ లెవెల్లో ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారు. కాగా ఈ సినిమాకి ఉన్న హైప్ లో ఇది వరకు 1000 కోట్ల బాక్సాఫీస్ వసూళ్లు అందుకునే సినిమా ఇది అవుతుంది అని అంతా అనుకున్నారు.

Rashmika Mandanna s Chhaava face of Allu Arjun s Pushpa 2 Is 1000 crores target collapsed

అలాగే ఈ సినిమాతోనే తాను కూడా 1000 కోట్ల హీరో అయిపోతానని బన్నీ కూడా అనుకొని ఉండొచ్చు. ఈ సినిమా మీద ఉన్న హైప్ తో ఈ ఆగష్టు 15కి అనుకున్నట్టుగా వచ్చి ఉంటే ఆ మార్క్ అందుకునేది ఏమో కానీ ఇక్కడ నుంచి డిసెంబర్ 6కి మేకర్స్ డేట్ ని షిఫ్ట్ చేసారు. ఇన్ని రోజులు సోలో రిలీజ్ గానే వచ్చి 1000 కోట్లు వసూళ్లు కొట్టేస్తుంది అనుకున్న అభిమానులకి పెద్ద షాకే ఇప్పుడు తగిలింది అని చెప్పాలి.

కాగా ఇప్పుడు ఓ సినిమా 1000 కోట్ల వసూళ్లు కొట్టాలి అంటే హిందీ మార్కెట్ వసూళ్లు కూడా చాలా ముఖ్యం. అక్కడ మినిమమ్ 200 నుంచి 300 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ వసూళ్లు కూడా చాలా ముఖ్యం. మరి సరిగ్గా పుష్ప డేట్ లోనే బాలీవుడ్ నుంచి సెన్సేషనల్ చిత్రం "ఛావ్వా" ని అనౌన్స్ చేసారు. యోధుడు శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా విక్కీ కౌశల్ నటించిన ఈ చిత్రం టీజర్ తో ఒక్కసారిగా భారీ హైప్ స్టార్ట్ అయ్యింది.

దీనితో నార్త్ మార్కెట్ లో పుష్ప 2 కి గట్టి పోటీనే ఎదురవుతుంది అని చెప్పాలి. కాగా నార్త్ లో శివాజీ మహారాజ్ కి కల్ట్ ఫాలోయింగ్ ఉంది. సో ఇప్పుడు ఈ సినిమా పుష్ప 2 కి పెద్ద అవాంతరాన్నే తీసుకొచ్చేలా ఉందని చెప్పాలి. అయితే ఇక్కడ ఇంకా ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే రెండు సినిమాల్లో కూడా హీరోయిన్ గా రష్మిక మందన్ననే నటిస్తుంది.

దీనితో ఇది రష్మిక వర్సెస్ రష్మిక అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉండగా ఇప్పుడు ఇదే రష్మిక సినిమా పుష్ప 2 1000 కోట్ల క్లబ్ లోకి వెళ్లే వీలు లేకుండా తూట్లు పొడిచింది అని కూడా సోషల్ మీడియాలో నెటిజన్స్ అనుకుంటున్నారు. దీనితో అయితే బన్నీ 1000 కోట్ల కల కలగానే మిగిలిపోయేలా ఉందని చెప్పాలి.

More from Filmibeat

Read more about: allu arjun rashmika mandanna
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X