రష్మిక మందన్న ‘ఛావా’కు మరో దెబ్బ.. భారీ నష్టం.. ఈసారి ఏమైందంటే?

నేషనల్ క్రష్ రష్మిక మందన్న వరుస హిట్టను తన ఖాతాలో వేసుకుంటోంది. ఇప్పటికే 'పుష్ప2'తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ స్టార్ హీరోయిన్ తాజాగా మరో బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకుంది. బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌషల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'ఛావా'. రష్మిక మందన్న ఫీమేల్ లీడ్ లో నటించింది. ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. విక్కీ కౌషల్ శంబాజీగా, రష్మిక యేసుబాయ్ గా అద్భుతమైన పెర్ఫామెన్స్ ఇచ్చారు. దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ప్రతి ఫ్రేమ్ ను అదరగొట్టారు.

'ఛావా' చిత్రంలోని యుద్ద సన్నివేశాలతో థియేటర్లు దద్దరిల్లి పోతున్నాయి. మాడాక్ బ్యానర్ పై రూ.140కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఫిబ్రవరి 14న హిందీ భాషలో గ్రాండ్ విడుదల చేశారు. ఏఆర్ రెహమాన్ అద్భుతమైన సంగీతం అందించిన ఈ చిత్రం తొలిరోజు నుంచే మాసీవ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. విక్కీ కౌషల్, రష్మిక మందన్న నటనపై ప్రశంసలు కురిపిస్తున్నఆడియెన్స్.. బాక్సాఫీస్ వద్ద కూడా 'ఛావా' చిత్రాన్ని విజయవంతం చేస్తున్నారు. మొదటి రోజు నుంచి ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపిస్తూనే వస్తోంది. ఇప్పటి వరకు రూ.540 కోట్లకు పైగా గ్రాస్ వసూల్ చేసి ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Rashmika Mandanna s Chhaava Movie Facing Problem again What has happened this time

ఇదిలా ఉంటే.. 'ఛావా' చిత్రానికి ఇప్పటికే పరువు నష్టం దావా అంటూ షిర్కే వారసులు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. తమ పూర్వీకులను తప్పుగా చూపించారని, శంభాజీకి ఎంతో దగ్గరగా, సన్నిహితంగా ఉన్న తమ షీర్కే వంశస్తులను విరోధులుగా చూపించారని ఇప్పటికే మూవీ టీమ్ కు నోటీసులు అందాయి. సన్నివేశాలను మార్చకపోతే రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ఇదిలా ఉండగానే.. తాజాగా 'ఛావా'కు మరో సమస్య ఎదురైంది. 'ఛావా' చిత్రం పైరసీ బారిన పడిందని తెలుస్తోంది. దాని వల్ల థియేటర్లకు ప్రస్తుతం 25 శాతం రెవెన్యూ గండిపడిందంట. అంతే కాదు మరో 25 పర్సెంటేజ్ ఓటీటీ ప్లాట్ ఫామ్ కు కూడా వ్యూయర్ షిప్ తగ్గే ప్రమాదం ఉందని బీటౌన్ లో వార్తలు వస్తున్నాయి.

ఛావా పైరసీపై సైబర్ సెక్యూరిటీ కూడా విచారణ చేస్తున్నట్టు సమచారం. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అక్రమ హ్యాకర్లు సినిమాలను పైరసీ చేసే చీడపురుగుళ్ల పుట్టుకొస్తూనే ఉన్నారు. ఇక 'ఛావా' నార్త్ లో సెన్సేషన్ గా మారడంతో తెలుగులోనూ రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. మార్చి 7న ఈ చిత్రాన్ని తెలుగు వెర్షన్ లో విడుదల చేయబోతున్నారు. టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. సినిమా రిలీజ్ కంటే ముందే.. ఛావాపై మరింత హైప్ పెంచేందుకు గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేయబోతున్నారని తెలుస్తోంది.

Rashmika Mandanna s Chhaava Movie Facing Problem again What has happened this time

మరోవైపు ఈ చిత్రానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగు వెర్షన్ కు వాయిస్ ఓవర్ ఇచ్చారనే వార్త ఒకటి ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. మరి దానిపై మాత్రం ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. దీంతో మార్చి 7న ఎన్టీఆర్ వాయిస్ ఉందా? లేదా? అన్నది తెలిసిపోనుంది. ఇక తెలుగు వెర్షన్ ను కూడా పైరసీ కాకుండా చూసుకోవాల్సి అవసరం ఉంది. ఇప్పటికే టాలీవుడ్ లో డాకూ మహారాజ్, గేమ్ ఛేంజర్, తండేల్ చిత్రాలు పైరసీకి గురైన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X