శేఖర్ కమ్ముల నువ్వే తోపువైతే.. ఆ పని చెయ్.. కుబేర నిర్మాతలు వార్నింగ్
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల - తమిళ స్టార్ ధనుష్ కాంబోలో వస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ 'కుబేరా'. నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్ రావు నిర్మించారు. తెలుగు, తమిళంతో పాటు హిందీ భాషలో ఏకకాలంలోనే ఈ చిత్రాన్ని షూటింగ్ జరుపుతుండటం విశఏషం. ఈ చిత్రంలో ధనుష్, నాగార్జునతో పాటు నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా నటిస్తోంది. అలాగే జిమ్ సర్భ్, దలీప్ తహిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే.. ఇప్పుడు ఈ సినిమా టైటిల్ కాంట్రవర్సీగా మారింది. అప్పటికే మండలిలో రిజిస్టర్ అయిన
ప్రొడ్యూసర్ నరేంద్ర మాట్లాడుతూ.. త్రిశక్తి ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై నేను 'కుబేరా' అనే చిత్రాన్ని తీయాలనుకున్నాను. 2023లోనే ఈ టైటిల్ ను తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఐదు లాంగ్వేజీల్లో రిజిస్టర్ చేసుకున్నాను. 22 నవంబర్ 2023న మాకు అఫ్రూవల్ వచ్చింది. ఆ వెంటనే మేం షూటింగ్ స్టార్ట్ చేశాం. ఆ తర్వాత మార్చి 8, 2024న శేఖర్ కమ్ముల 'కుబేరా' అని ఫస్ట్ లుక్ విడుదలైంది. ఆ వెంటనే నేను మండలికి వెళ్లి అడిగాను. మేం రిజిస్టర్ చేసుకున్న టైటిల్ ను శేఖర్ కమ్ముల వారికి ఎలా ఇచ్చారని అడిగాను.

కానీ మండలిలో ఉన్న ప్రసన్న కుమార్ దుర్భాషలాడాడు. మీది చిన్న సినిమా.. పెద్దవాళ్లతో పెట్టుకుంటే ఎలా తట్టుకుంటారని బెదిరించారు. ఆ తర్వాత న్యాయం కోసం కోర్టుకు వెళ్లాను. అయితే ఇప్పుడు ఆ చిత్రం రిలీజ్ కు కూడా సిద్ధమవుతుండటంతో న్యాయం జరగాలని ఇలా ప్రెస్ మీట్ నిర్వహించామన్నారు. ఆ తర్వాత కో ప్రొడ్యూసర్స్ మాట్లాడుతూ... టైటిల్ గురించి రకారకాలుగా మండలివారు చెబుతున్నారు. శేఖర్ కమ్ముల కుబేరా, ధనుష్ కుబేరా.. మొదట కుబేరా అని చెప్పి పోస్టర్లు రిలీజ్ చేసినా... కుబేరా అనేది పెద్ద సినిమా కాదని సమాధానం ఇస్తున్నారు. రిజిస్టర్ చేసుకున్నాకా కూడా ఇలా చేయడం సరికాదు కదా? అని ప్రశ్నించారు.
వీలైతే టైటిల్ మార్చుకోండి లేదంటే షేర్ ఇవ్వండి అని సూచించారు. కుబేర సినిమాను మేం మంచి ఎఫర్ట్ పెట్టి నిర్మించామన్నారు. అప్పటికే శేఖర్ కమ్ముల ఇదే టైటిల్ ను అనైన్స్ చేయడంతో షాక్ అయ్యాం. మాకు న్యాయం చేయాలని కోరారు. లీగల్ అడ్వైజర్ మాట్లాడుతూ.. ఈ సినిమా ఇప్పటికే 90శాతం పూర్తైందని చెప్పారు. హీరో గణ ఆదిత్యతో షూటింగ్ జరిపించారన్నారు. కానీ టైటిళ్లను కాపీ కొట్టడం సరికొద్దన్నారు. ఏ ఇండస్ట్రీలోనైనా ఇలా ఒకరి టైటిల్ ను, పేర్లను కాపీ కొట్టడం భావ్యం కాదని చెప్పారు.
అలాగే మహేశ్ ఖలేజా చిత్రం సమయంలోనూ ఇలాగే జరిగిందని చెప్పుకొచ్చారు. సినీ పెద్దలు దయచేసి అర్థం చేసుకోని నిర్మాతలకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. మొత్తానికి నిర్మాతలు ఇలా తిరగబడటంతో శేఖర్ కమ్ముల టీమ్ ఇప్పుడు షాక్ కు గురైంది. త్వరలో రిలీజ్ కాబోనున్న ఈ చిత్రానికి ఇలా షాక్ తగలడం ఆసక్తికారంగా మారింది. ఇక ఈ చిత్రాన్ని హైదరాబాద్, ముంబైలో చిత్రీకరించారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. నికేత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీగా, కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్, తోట తరణి ప్రొడక్షన్ డిజైనింగ్ కు సహకరించారు.


Click it and Unblock the Notifications











