రథం మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. RX100ను తలపించే రొమాన్స్‌తో..
రాజ్‌గురు ఫిల్మ్ బ్యానర్‌పై నిర్మాత రాజా దారాపునేని నిర్మించిన రథం సినిమా విడుదలకు ముస్తాబైంది. దసరా పండుగను పురస్కరించుకొని రథం రిలీజ్ డేట్‌ను చిత్ర నిర్మాత రాజా దారుపునేని ప్రకటించారు. యాక్షన్ రొమాంటిక్ చిత్రంగా రూపొందిన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 26న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్టు ఆయన వెల్లడించారు.

గీతానంద్, చాందినీ భగ్వానని జంటగా నటిస్తున్న చిత్రానికి చంద్రశేఖర్ కానురి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సుకుమార్ పమ్మి సంగీతాన్ని అందిస్తున్నారు. ఎడిటర్‌గా బీ నాగేశ్వర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. రిఈ చిత్రాన్ని ఏ వినోద్ సమర్పిస్తున్నారు.

రథం చిత్రానికి సంబంధించిన ఏదో ఏదేదో సాంగ్ టీజర్లను ప్రముఖ దర్శకుడు, జాతీయ అవార్డు గ్రహీత చంద్రశేఖర్ ఏలేటి, ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లముడి ఆవిష్కరించారు. ఈ చిత్రంలోని పాటలను ఎల్‌వీ రేవంత్, లిపిసిక పాడారు. గిరిధర్ సాహిత్యం అందించారు. పాటలకు చంద్రం కోరియోగ్రఫిని అందించారు.


Click it and Unblock the Notifications











