చంద్రశేఖర్ ఏలేటి చేతుల మీదుగా రథం సాంగ్ టీజర్..
రాజ్‌గురు ఫిల్మ్ బ్యానర్‌పై నిర్మాత రాజా దారాపునేని నిర్మించిన రథం సినిమా రిలీజ్ ముస్తాబువుతున్నది. ఈ చిత్రాన్ని ఏ వినోద్ సమర్పిస్తున్నారు. గీతానంద్, చాందినీ భగ్వానని జంటగా నటిస్తున్న చిత్రానికి చంద్రశేఖర్ కానురి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సుకుమార్ పమ్మి సంగీతాన్ని అందిస్తున్నారు. ఎడిటర్‌గా బీ నాగేశ్వర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.
రథం చిత్రానికి సంబంధించిన ఏదో ఏదేదో సాంగ్ టీజర్‌ను ప్రముఖ దర్శకుడు, జాతీయ అవార్డు గ్రహీత చంద్రశేఖర్ ఏలేటి ఆవిష్కరించారు. ఈ పాటను ఎల్‌వీ రేవంత్, లిపిసిక పాడారు. గిరిధర్ సాహిత్యం అందించారు. పాటకు చంద్రం కోరియోగ్రఫిని అందించారు.
ఈ సందర్భంగా చంద్రశేఖర్ ఏలేటి మాట్లాడుతూ.. పాట చిత్రీకరణ, సాహిత్యం ఆకట్టుకునేలా ఉంది. చిత్ర యూనిట్‌కు ఘన విజయం లభించాలని ఆకాంక్షించారు. సంగీత దర్శకుడిని అభినందించారు. సినిమాలో కొత్తదనం కనిపిస్తున్నదని అన్నారు.

బ్యానర్: రాజ్‌గురు ఫిల్మ్స్
నిర్మాత: రాజ దారపునేని
సమర్పణ: ఏ వినోద్
నటీనటులు: గీతా నంద్, చాందినీ భగ్వానని
దర్శకుడు: చంద్రశేఖర్ కానురి
సంగీతం: సుకుమార్ పమ్మి
సినిమాటోగ్రఫి: సునీల్ ముత్యాల
ఎడిటర్: బీ నాగేశ్వర్ రెడ్డి


Click it and Unblock the Notifications











