Bigg Boss Telugu 7 Winner: అతడితో కలిసి గోవా వెళ్లిన రతికా రోజ్.. లోపల ఉన్నప్పుడే ప్లాన్ చేసుకున్నారా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో గురించి అందులోని కంటెస్టెంట్ల గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన ఆట తీరుతో అందరినీ ఆకట్టుకున్న కంటెస్టెంట్లు ఇటవీలే బయటకు వచ్చేశారు. ముఖ్యంగా విన్నర్ ఎవరు, రన్నరప్ ఎవరు అనే దానిపై కూడా పూర్తిగా క్లారిటీ వచ్చేసింది. షో ఇలా అయిపోయిందో లేదో చాలా మంది కంటెస్టెంట్లు ట్రిప్ లకు ప్లాన్ చేసుకుంటున్నారు. తమకు నచ్చిన వాళ్లతో కలిసి తమకు నచ్చిన చోటుకు వెళ్తున్నారు. ముఖ్యంగా రతికా రోజ్ తాజాగా గోవాకు వెళ్లింది. అయితే ఆమె ఓ అబ్బాయి.. ముఖ్యంగా అతడు కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్ యే కావడం గమనార్హం. అయితే ఆమె ఎవరితో వెళ్లింది, ఏం చేసిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

బిగ్ బాస్ హౌస్ లో మొదటి వారమే అడుగు పెట్టిన రతికా రోజ్.. టాస్క్ లలో పెద్దగా పర్ఫార్మెన్స్ చేయకపోయినా కాస్త రచ్చ అయితే చేసింది. ముఖ్యంగా మొదటి వారమే రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ తో కలిసి పులిహోర కలిపింది. అతడితో లవ్ ట్రాక్ నడిపితే హౌస్ లో ఎక్కువ కాలం ఉండొచ్చు అనుకుందో ఏమనుకుందో తెలియదు గానీ.. నేనంటే ఇష్టమేనా, ఎందుకు, ఎమిటి అంటూ ప్రశ్నలు అడుగుతూ... కంటెంట్ ఇచ్చింది. కానీ సడన్ గా రెండో వారం నామినేన్స్ సమయంలో పెద్ద రచ్చ చేసింది. ఎవరూ ఊహించని స్థాయిలో రైతుబిడ్డపై ఫైర్ అయింది. ముఖ్యంగా అమర్ దీప్ తో కలిసి పల్లవి ప్రశాంత్ ను ఓ ఆట ఆడుకుంది.

Rathika Rose Going to Goa With Bigg Boss Telugu 7 Contestants Check Details

అలా బయట ఫుల్ నెగిటివిటీ తెచ్చుకుందీ హాట్ బ్యూటీ. కానీ మరో రెండు వారాల పాటు ఇంట్లోనే కొనసాగింది. నాలుగో వారం హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. బయటకు వచ్చాక తనకు వచ్చిన నెగిటివిటీ చూసి బిగ్ బాస్ టీం నిర్వాహకులను మరోసారి బతిమాలుకోగా.. వాళ్లు ఆమె రీఎంట్రీకి ఏర్పాట్లు చేశారు. ఉల్టా పుల్టా కాన్సెప్ట్ పేరుతో ఓటింగ్ సిస్టం తెచ్చి... ఎక్కువ వచ్చిన వారి కంటే తక్కువ వచ్చిన వారే ఇంట్లోకి రావొచ్చంటూ ట్విస్ట్ ఇచ్చారు. ఇలా మరోసారి హౌస్ లో అడుగు పెట్టింది రతికా రోజ్. ఇక ఆ తర్వాత నుంచి శివాజి, పల్లవి ప్రశాంత్, యావర్ లతో క్లోజ్ గా ఉంటూ వారితోనే తరిగింది. నెక్స్ట్ వారంలో వెళ్లిపోతాను అనుకునే సమయంలో మరోసారి వాళ్లతో గొడవ పెట్టుకుని రచ్చ చేసింది.

ఎట్టకేలకు 11వ వారంలో హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. వచ్చినప్పటి నుంచి ఇంటర్వ్యూలు ఇస్తూ ఫుల్ బిజీగా మారిపోయిందీ ముద్దుగుమ్మ. తాను చేసిన తప్పుల గురించి చెబుతూనే తాను ఎవరికి సపోర్ట్ చేస్తుందో కూడా వివరించింది. ముఖ్యంగా రైతుబిడ్డతో అంత గట్టిగా చెప్పకుండా మెల్లిగా క్యూట్ గా చెబితే తనకు అసలు నెగిటివిటీయే వచ్చేది కాదని కూడా వివరించింది. ఇలా చాలానే సాగినా ప్రస్తుతం మాత్రం చాలా హ్యాపీగా కనిపిస్తోంది. ఇంట్లో జరిగిన గొడవలేం పట్టించుకోకుండా కంటెస్టెంట్లతో కలిసి గోవా ప్లాన్ చేసింది.

Rathika Rose Going to Goa With Bigg Boss Telugu 7 Contestants Check Details

ముఖ్యంగా రతికా రోజ్ అందరూ ఊహించినట్లుగా ప్రిన్స్ యావర్ తో కాకుండా.. టేస్టీ తేజతో గోవా వెళ్లింది. టేస్టీ తేజ ఒక్కడితోనే కాదు లెండి... శుభ శ్రీ కూడా వీరి వెంట ఉంది. కానీ ఈ ముగ్గురికి ఫ్లైట్ లేట్ ఉండే సరికి ఎయిర్ పోర్టులో చాలానే రచ్చ చేశారు. డబుల్ మీనింగ్ డైలాగ్ లతో పాటు తిండి గురించి కూడా మాట్లాడుకున్నారు. అలగే గోవాలో ఏం చేయబోతున్నారో కూడా వివరించారు. పూర్తి వివరాలు తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X