Rathnam Twitter Review విశాల్ మాస్ ఎంటర్‌టైనర్.. హరితో హ్యాట్రిక్ కొట్టాడా?
యాక్షన్ హీరో విశాల్, మాస్ డైరెక్టర్ హరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం రత్నం. భరణి, పూజా లాంటి హిట్స్ తర్వాత ఈ సినిమా వస్తుండటంతో వీరిద్దరు కలిసి హ్యాట్రిక్ కొడుతారని అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకొన్నారు. జీ స్టూడియోస్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'రత్నం'. కార్తికేయన్ సంతానం ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు. రత్నం మూవీని శ్రీ సిరి సాయి సినిమాస్ బ్యానర్ మీద తెలుగులో సీహెచ్ సతీష్ కుమార్, కే రాజ్ కుమార్ సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నారు. తెలుగు, తమిళ్ లో ఏప్రిల్ 26న గ్రాండ్‌గా రిలీజ్ రత్నం సినిమా గురించి నెటిజన్లు ఎలాంటి అభిప్రాయాలు సోషల్ మీడియాలో వ్యక్తం చేశారనే వివరాల్లోకి వెళితే..
రత్నం సినిమాలో సాంగ్స్, ఎమోషన్స్, స్క్రీన్ ప్లే లాంటి అంశాలు బాగున్నాయి. అన్నికంటే ముఖ్యంగా ఫిల్మోగ్రఫి ది బెస్ట్. రత్నం సినిమా మంచి మసాలా, హాట్ సినిమా అని నెటిజన్ తన అభిప్రాయాన్ని పోస్టు రూపంలో వ్యక్తం చేశారు.

పురచ్చి దళపతి విశాల్ నటించిన రత్నం సినిమా గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా హిట్ కావాలని మనసారా కోరుకొంటున్నాం. మాస్, యాక్షన్, ఎంటర్‌టైనర్‌గా రూపొందిన సినిమా చూడటానికి మేమంత ఎదురుచూస్తున్నాం. దేవీ శ్రీ ప్రసాద్, విశాల్‌కు కంగ్రాట్స్ అంటూ కామెంట్ చేశాడు.
విశాల్, హరి కాంబినేషన్‌లో వస్తున్న రత్నం సినిమాపై బజ్ అంతగా క్రియేట్ కాలేదు. కానీ పవర్ ప్యాక్ యాక్షన్ ఎలిమెంట్స్ సినిమాను హిట్ చేయడమే కాదు.. థియేటర్లకు భారీగా రప్పిస్తుంది. ఈ ఫ్యామిలీ డ్రామా అందరికి నచ్చేలా ఉంటుందని నెటిజన్స్ కామెంట్ పెట్టారు.


Click it and Unblock the Notifications











