NTR30: ఎన్టీఆర్ మూవీ నుంచి మరో లీక్.. గూస్‌బమ్స్‌కు మించిన యాక్షన్ అంటూ ట్వీట్

పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'టెంపర్' మూవీ నుంచి ఏకధాటిగా హిట్లు మీద హిట్లు కొడుతూ మరెవరికీ సాధ్యం కాని రీతిలో డబుల్ హ్యాట్రిక్‌ను సొంతం చేసుకున్నాడు నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్. ఈ విజయాలే కాదు.. రాజమౌళి తెరకెక్కించిన RRR మూవీతో అతడి రేంజ్‌ హాలీవుడ్ వరకూ పెరిగిపోయింది. దీంతో తారక్‌కు హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ ఎన్నో ఆఫర్లు కూడా వస్తున్నాయి. దీంతో అతడిలో ఉత్సాహం రెట్టించిందనే చెప్పాలి. ఈ జోష్‌తోనే ఇప్పుడు ఎన్టీఆర్ తన 30వ సినిమాను జెట్ స్పీడుతో చేసుకుంటూ ముందుకు సాగిపోతోన్నాడు.

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ తన 30వ సినిమాను చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టును ఎప్పుడో ప్రకటించినా.. షూటింగ్ మాత్రం అనుకున్న సమయానికి మొదలవలేదు. దీంతో ఎన్నో అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ పరిస్థితుల్లో గత నెలలోనే ఎన్టీఆర్ మూవీ షూటింగ్ మొదలైంది. ఫస్ట్ షెడ్యూల్‌ను శంకరపల్లిలో, రెండో దాన్ని రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్‌లలో జరుపుకున్నారు. వీటిలో తారక్‌తో పాటు ప్రధాన పాత్రలు చేస్తోన్న స్టార్లకు సంబంధించిన కీలక సన్నివేశాలు, యాక్షన్ పార్టులను షూట్ చేశారు.

Jr NTR and Koratala Movie

ఒకపక్క ఎన్టీఆర్ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతుండగానే.. దీని నుంచి ఎన్నో రకాల వార్తలు బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రానికి కెమెరామెన్‌గా పని చేస్తోన్న రత్నవేలు ఓ ట్వీట్ చేశాడు. అందులో 'పవర్‌ఫుల్ యాక్షన్ పార్టులతో ఎన్టీఆర్30వ సినిమా షూటింగ్ రెండో షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్నాం. ఇందులో తారక్ బ్రదర్ స్టైల్ అండ్ యాక్షన్ అదిరిపోయింది. వస్తున్నా' అంటూ రాసుకొచ్చాడు. ఇక, రత్నవేలు చేసిన ఈ ట్వీట్‌తో ఇప్పటి వరకూ ఈ మూవీపై ఉన్న అంచనాలు మరింతగా పెరిగిపోయాయని చెప్పుకోవచ్చు.

పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కలయికలో వస్తున్న ఈ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో జాన్వీ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీని 2024 ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X