Devara: క్రేజీ న్యూస్ లీక్ చేసిన కెమెరామెన్.. ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ ఇదేనా!

టాలీవుడ్‌లోని స్టార్ హీరోలలో చాలా మంది పాన్ ఇండియా రేంజ్‌లో సత్తా చాటుతోన్నారు. అందులో నందమూరి చిన్నోడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. RRR మూవీతో అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిని అందుకున్న ఈ బడా హీరో.. ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు తన 30వ సినిమా 'దేవర'ను కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నాడు. సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ హై ఓల్టేజ్ యాక్షన్ మూవీపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాటికి ఏమాత్రం తీసిపోని విధంగానే దీన్ని తెరకెక్కిస్తున్నారు.

కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందుతోన్న 'దేవర' మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను గత మార్చిలోనే ప్రారంభించారు. ఆ వెంటనే దీనికి సంబంధించిన నాలుగు భారీ యాక్షన్ షెడ్యూళ్లను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్నారు. వీటిలో ఎన్నో ఫైట్ సీక్వెన్స్‌లతో పాటు కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఇలా నవంబర్ నాటికి ఈ సినిమా షూటింగ్ పార్టు మొత్తాన్ని పూర్తి చేయాలని చిత్ర యూనిట్ టార్గెట్‌గా పెట్టుకుని శరవేగంగా పని చేసుకుంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ గురించి కెమెరామెన్ చేసిన ట్వీట్ హైప్ పెంచేస్తుంది.

Rathnavelu Tweet Increases Hypes on Jr NTR Devara Movie

'దేవర' చిత్రానికి కెమెరామెన్‌గా పని చేస్తోన్న రత్నవేలు తాజాగా షూటింగ్ గురించి ఓ ట్వీట్ చేశాడు. అందులో 'వెన్నెలతో ప్రకాశవంతంగా ఉన్న సముద్రంపై భయంకరమైన, రక్తదారతో కూడిన యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేశాము' అంటూ రాసుకొచ్చాడు. ఇక, రత్నవేలు చేసిన ఈ ట్వీట్‌తో ఇప్పటి వరకూ ఈ మూవీపై ఉన్న అంచనాలు మరింతగా పెరిగిపోయాయని చెప్పుకోవచ్చు. ఇక, ఈ సీక్వెన్స్ 'దేవర' సినిమాలో ఎన్టీఆర్ ఇంట్లో సమయంలో వచ్చేది అని కూడా ఓ న్యూస్ లీకైంది. దీంతో దీనిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబోలో రాబోతున్న ఈ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో జాన్వీ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ మూవీని 2024 ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X