KGF Chapter 2: పని పూర్తి చేసిన అందమైన ప్రధాని.. డైరెక్టర్‌తో దిగిన ఫొటో వైరల్
కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చి.. దేశ వ్యాప్తంగా ఎనలేని క్రేజ్‌ను అందుకున్న చిత్రం 'KGF Chapter 1'. రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీ కన్నడం, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైన విషయం తెలిసిందే. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రం అన్ని చోట్లా సూపర్ డూపర్ హిట్ అయింది. అదే సమయంలో కలెక్షన్ల రికార్డులు క్రియేట్ చేసింది. అలాగే, జాతీయ అవార్డులను సైతం సొంతం చేసుకుంది. దీంతో శాండిల్‌వుడ్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇంతటి భారీ విజయాన్ని దక్కించుకున్న ఈ సినిమాకు సీక్వెల్ కూడా వస్తోంది.
'KGF Chapter 1' బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో 'కేజీఎఫ్ చాప్టర్ 2' పేరిట దీనికి సీక్వెల్ తీస్తున్నారు. కేజీఎఫ్‌ను సొంతం చేసుకున్న రాఖీ భాయ్‌ను ఎదురించేందుకు అధీరా ఎంట్రీ ఇవ్వడంతో ఈ కథ మొదలవుతుంది. ఆ తర్వాత వాళ్లిద్దరి మధ్య పోరాటం జరిగే తీరుతోనే సినిమా రూపొందింది. ఇక, ఆ అధీరా పాత్రను బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ పోషిస్తోన్న విషయం తెలిసిందే. ఇక, ఈ సినిమా షూటింగ్ మొదలై చాలా కాలమే అవుతోంది. అయినప్పటికీ అనివార్య కారణాల వల్ల పలుమార్లు ఆటంకం ఏర్పడడంతో షూటింగ్ సజావుగా నడవలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది రోజుల క్రితమే ఈ మూవీ టాకీ పార్టును కంప్లీట్ చేసుకున్నారు.

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'కేజీఎఫ్ చాప్టర్ 2' షూటింగ్ పూర్తి చేసుకున్న వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ప్రారంభించారు. వీటికి సంబంధించిన అన్ని రకాల వర్క్స్ దాదాపుగా కంప్లీట్ అయ్యాయి. దీంతో ఈ సినిమాను గత ఏడాదే విడుదల చేస్తారని ప్రచారం జరిగింది. కానీ, కోవిడ్ సెకెండ్ వేవ్ కారణంగా అది సాధ్యపడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని 2022, ఏప్రిల్ 14కు వాయిదా వేస్తున్నారని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. దీంతో సినిమాకు సంబంధించిన మిగిలిన పనులను చిన్నగా పూర్తి చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ యూనిట్ ఓ అప్‌డేట్ ఇచ్చింది.
'కేజీఎఫ్ చాప్టర్ 2' మూవీలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ రమిక సేన్ అనే భారత ప్రధాని పాత్రను పోషిస్తోంది. ఈ మూవీలో ఆమె పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను ఎప్పుడో పూర్తి చేసుకున్న ఆమె.. తాజాగా డబ్బింగ్ పనులను కూడా కంప్లీట్ చేసేసింది. ఈ విషయాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించాడు. ఈ మేరకు ఆమెతో దిగిన ఫొటోలను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ.. 'ఉక్కు సంకల్పం ఉన్న అధినేత.. ఎంతో కూల్ పర్సన్ అయిన రమిక సేన్ తన డబ్బింగ్‌ను పూర్తి చేసుకున్నారు. థ్యాంక్యూ మేడమ్' అని పోస్ట్ చేశాడు. దీంతో ఈ ఫొటో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
అంచనాలకు అనుగుణంగానే ఆ మధ్య విడుదలైన 'కేజీఎఫ్ చాప్టర్ 2' టీజర్ నేషనల్ రికార్డులను క్రియేట్ చేసింది. ఈ సినిమాను హొంబళే ఫిల్మ్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా చేస్తోంది. వీళ్లతో పాటు పలు పరిశ్రమలకు చెందిన ఎంతో మంది నటీనటులు కీలక పాత్రలు చేస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందించాడు.


Click it and Unblock the Notifications











