రాకీ భాయ్‌కి మరణ శిక్ష విధించేది ఆమెనా?.. వైరల్ అవుతున్న పిక్
ఒక్క సినిమా కన్నడ ఇండస్ట్రీ మొత్తాన్ని తలెత్తుకునేలా చేసింది. అప్పటి వరకు శాండిల్ వుడ్ అంటే చిన్నచూపు చూసినవారికి చెంపపెట్టులా చేసింది కేజీయఫ్ చిత్రం. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీయఫ్ మొత్తం దేశాన్ని షేక్ చేసింది. అన్ని ఇండస్ట్రీలు కన్నడవైపు చూసేలా చేశాడు దర్శకుడు. కేజీయఫ్ ఎంతటి సంచలనాలు క్రియేట్ చేసిందో.. దాని సీక్వెల్ అంతకు మించి ఉండేలా ప్రయత్నిస్తున్నాడు ప్రశాంత్ నీల్.

అమాంతం పెరిగిన రాకీ బాయ్ క్రేజ్..
కేజీయఫ్‌లో నటించిన కన్నడ రాక్ స్టార్ యశ్.. క్రేజ్ అమాంతం వంద రెట్లు పెరిగింది. ఎక్కడ చూసినా రాకీ భాయ్ నినాదాలే.. రాకీ భాయ్ పోస్టర్లే. బాహుబలి సినిమాతో ప్రభాస్ ఏ రేంజ్‌లో పాపులర్ అయ్యాడో.. కేజీయఫ్‌తో యశ్‌కు అంతే పేరు వచ్చింది. యశ్ కాస్తా రాకీ భాయ్‌గా మారిపోయాడు.

దద్దరిల్లిన బాక్సాఫీస్..
రాకీ భాయ్ యశ్ దెబ్బకు బాక్సాఫీస్ దద్దరిల్లిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా దాదాపు రూ.250కోట్లు కొల్లగొట్టినట్టు టాక్. ఇక బాక్సాఫీస్ వద్ద ఈ రేంజ్‌లో దుమ్ములేపడంతో హీరో, దర్శకుడికి క్రేజ్ ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. దీంతో సీక్వెల్‌ను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు సిద్దమయ్యారు.

బాలీవుడ్ స్టార్స్‌తో..
కేజీయఫ్ చాప్టర్ 2 చిత్రాన్ని ప్యాన్ ఇండియా తెరకెక్కిస్తుండటంలో బాలీవుడ్ స్టార్‌ను కూడా రంగంలోకి దించారు. అత్యంత పవర్ ఫుల్ పాత్రైన అధీరా పాత్రలో సంజయ్ దత్ లాంటి బిగ్ స్టార్‌ను తీసుకున్నారు. ఇప్పటికే అధీరా, రాకీ భాయ్ లుక్స్ సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

తాజాగా మరో స్టార్..
చాప్టర్ 2లోని మరో కీలక పాత్రకు అలనాటి అందాల నటి రవీనా టాండన్‌ను తీసుకున్నారు. రాకీ భాయ్‌కు డెత్ వారెంట్ ఇచ్చేందుకు రవీనా టాండన్ రంగంలోకి దిగిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంటే ఈమె ప్రధాని పాత్రలో నటించబోతోన్నట్లు అర్థమవుతుంది. చాప్టర్ 2 దసరాకు వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











