Raveena Tandon వివాదంలో కేజీఎఫ్2 యాక్టర్.. అక్బరుద్దీన్ ఓవైసీకి మద్దతు తెలిపి చిక్కుల్లో రవీనా

ఔరంగబాద్‌లో ఔరంగజేబ్ సమాధికి ఏఐఎంఐఎం అధినేత అక్బరుద్దీన్ ఓవైసీకి నివాళులర్పించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే అక్బరుద్దీన్ ఓవైసీ తీరుపై రాజకీయ వర్గాలు రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అయితే ఇలాంటి వివాదం నేపథ్యంలో అక్బరుద్దీన్ ఓవైసీకి సినీ నటి రవీనా టాండన్ మద్దతు తెలియజేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

అక్బరుద్దీన్‌కు అండగా నిలుస్తూ.. ఇండియా స్వేచ్ఛాయుతమైన దేశం. ప్రతీ ఒక్కరికి సమాన హక్కులు ఉన్నాయి. మతం, వర్ణం విషయంలో సహనంగా ఉండాలి. ఎప్పుడూ సహనం పాటిస్తూ ఉండాలి అని రవీనా టాండన్ ట్వీట్ చేసింది.

Raveena Tandon supports Akbaruddin Owaisi tribute to Aurangzeb tomb

నా దేశంలో అసహనం పెరిగిపోతుందని ప్రచారం చేయడం ఫ్యాషన్‌గా మారింది. సహనాన్ని పటించడంలో మనం ఎంత స్ట్రాంగ్‌గా ఉంటామో కొన్ని సందర్భాలు సాక్ష్యంగా నిలిచాయి అని ఆమె ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

కొద్దికాలంగా హిందూ సంస్థలుగా చెప్పుకొనే సంస్థలపై పదునైన విమర్శలు చేస్తున్నారు. కాషాయ పార్టీల విధానాన్ని తూర్పార పడుతున్నది. అయితే తనకు రాజకీయాల్లో వచ్చే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. అయితే అక్బరుద్దీన్ ఓవైసీకి మద్దతు తెలియజేయడంపై మహారాష్ట్రలో రాజకీయ వర్గాలు భగ్గుమన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X