మున్నీకి ఏమైంది.. ఎందుకలా ప్రవర్తిస్తోంది.. ఆసక్తికరంగా ఆవిరి ట్రైలర్
కొత్త కథలను మరింత కొత్తగా తెరకెక్కించడంలో రవిబాబు దిట్టా. ఇంతవరకు అన్నీ జానర్లను టచ్ చేసిన రవిబాబు.. ప్రతీ దాంట్లో సక్సెస్ అయ్యాడు. కామెడీ, ఎమోషన్, లవ్, రివేంజ్, హారర్, సైకో థ్రిల్లర్ ఇలా ఏ చిత్రాలను తీసినా.. అందులో ఆయన మార్క్ కనబడేలా తెరకెక్కిస్తుంటాడు.
రవిబాబు హారర్ మూవీస్‌ను ఎంత గ్రిప్పింగ్‌గా తెరకెక్కిస్తారో అందరికీ తెలిసిందే. ఆవిరి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నరవిబాబు.. ఆవిరి2 అంటూ సీక్వెల్ కూడా తీశారు. తాజాగా పందితో సినిమాను తీసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అయితే ఈ మూవీ మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది.

తాజాగా ఆవిరి అంటూ మరోసారి ప్రేక్షకులను బయపెట్టేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్‌తో ఆకట్టుకున్న ఆవిరి.. ట్రైలర్‌తో బయపెట్టేసింది. మున్నీని దెయ్యం పట్టిందా? మున్నీతో దెయ్యం ఎందుకు స్నేహం చేస్తోంది? మధ్యలో ఆవిరి కథ ఏంటి? అనే అనుమానాలు వచ్చేట్టుగా.. సినిమాను చూసేయ్యాలనే ఆసక్తిని రేకెత్తించేలా ట్రైలర్‌ను కట్ చేశారు.
రవిబాబు, నేహా చౌహాన్ ప్రధాన పాత్రలో నటించగా.. భరణిశంకర్, ముక్తా ఖాన్, శ్రీముక్త, హిమజ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 1న ప్రేక్షకులను భయపెట్టేందుకు వస్తోంది.


Click it and Unblock the Notifications











