రవిబాబు మరో టీనేజ్ రొమాంటిక్ కామెడీ మూవీ 'క్రష్'.. బోల్డ్ టీజర్

రెగ్యులర్ కమర్షియల్ దర్శకుల కంటే కాస్త భిన్నంగా ఆలోచించే దర్శకుల్లో రవిబాబు ఒకరు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న రవి బాబు ఈ సారి ఒక అడల్ట్ సినిమాతో కొత్త ప్రయోగమేదో చేయబోతున్నట్లు అర్ధమవుతోంది. అల్లరి సినిమాతో మసాలా డోస్ ని కాస్త వెరైటీగా చూపించిన రవిబాబు ఇప్పుడు మరొక టీనేజ్ లవ్ స్టోరీతో రాబోతున్నాడు.

టీనేజ్ రొమాంటిక్ కామెడీగా క్రష్ అనే సినిమాను రూపొందిస్తున్న రవిబాబు సినిమా పోస్టర్స్ తోనే హీట్ పెంచేస్తున్నాడు. ఇక రీసెంట్ గా ఫస్ట్ పీపీ అంటూ ఒక టీజర్ ని రిలీజ్ చేశారు. ఏ మాత్రం తగ్గకుండా లిప్ లాక్, బోల్డ్ సీన్స్ తో ఓ వర్గం ప్రేక్షకులను గట్టిగానే ఆకర్షిస్తాడాని అనిపిస్తోంది. డబుల్ మీనింగ్ డైలాగ్స్ కూడా గట్టిగానే ఉన్నాయి.

Ravi babu new adult romantic comedy movie crush

ముగ్గురు యువకుల సెక్సువల్ లైఫ్ కి సంబంధించిన బోల్డ్ కాన్సెప్ట్ తో సినిమాను తెరకెక్కించిన ఈ దర్శకుడు చివరగా అదుగో అంటూ పంది పిల్లతో కొంచెం కొత్తగా ట్రై చేసిన విషయం తెలిసిందే. కానీ వర్కౌట్ కాలేదు. అవును తరువాత సక్సెస్ లేకపోవడంతో రవిబాబు ఈ సారి ఎలాగైనా మంచి బాక్సాఫీస్ హిట్ అందుకోవాలని హాట్ కంటెంట్ తో రెడీ అవుతున్నాడు.

Ravi babu new adult romantic comedy movie crush

చూస్తుంటే సినిమా పోస్టర్స్ మంచి హైప్ క్రియేట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీనేజ్ వయసులో ఉండే కోరికలను ఈ సినిమాలో చాలా క్లియర్ గా చూపించనున్నారట. ఇక సెన్సార్ కి కూడా ఈ సినిమా పెద్ద సవాల్ విసిరే ఛాన్స్ ఉండవచ్చు. మరి సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఇక ఈ సినిమాలో అభయ్ సింహా, కృష్ణ బురుగుల, చరణ్ సాయి అంకితా మనోజ్, ప్రణీ పాండే, శ్రీ సుదా వంటి కొత్త నటీనటులు ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X