Don't Miss!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- News బాలకృష్ణకు షాక్: హిందూపురంలో నామినేషన్ వేసిన స్వామి పరిపూర్ణానంద
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
రవిబాబు క్లియర్ చేశాడు.. ఇక 'ఆవిరి'తో ఆటాడేందుకు రెడీ
సిల్వర్ స్క్రీన్ పై అలరించడంలో, మెగా ఫోన్ పట్టి భయపెట్టించడంలో రవిబాబు రూటే సపరేటు. ''అల్లరి, నచ్చావులే, అనసూయ, అవును, అవును 2'' లాంటి చిత్రాలతో తెలుగు చిత్రసీమలో తనదైన మార్క్ ఒకటుందని నిరూపించుకున్నాడు రవిబాబు. కెరీర్ ప్రారంభం నుంచే ఓ డిఫెరెంట్ అభిరుచి కలిగిన దర్శకుడిగా, మంచి టెక్నీషియన్‌గా గుర్తింపు పొందిన ఆయన మరికొద్ది రోజుల్లో 'ఆవిరి' రూపంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
తాజాగా ఆవిరి సెన్సార్ పూర్తిచేసుకుంది. ఈ చిత్రం చూసిన సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేసింది. హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు సమర్పణలో ఎ ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై రవిబాబు దర్శక నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రంలో రవిబాబు, నేహా చౌహాన్, శ్రీముక్త, భరణి శంకర్, ముక్తార్ ఖాన్ ప్రధాన పాత్రలు పోషించారు. నవంబర్ 1వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.
'ఆవిరి' చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవలే ఫస్ట్‌లుక్ విడుదల చేసి ఆసక్తి రేకెత్తించిన రవిబాబు.. టీజర్ రిలీజ్ చేసి భయపెట్టేశాడు. దీంతో ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది. ఇక థియేటర్లను 'ఆవిరి'తో ఆటాడేందుకు రెడీ అవుతున్నాడు రవిబాబు. హారర్ సినిమాలను తెరకెక్కించడంలో కొత్త కోణం చూపించిన రవిబాబు.. ఈ సినిమాతో మరో మెట్టు ఎక్కనున్నాడని స్పష్టంగా తెలుస్తోంది. చూడాలి మరి నవంబర్ 1 తర్వాత 'ఆవిరి' హవా ఎలా ఉంటుందనేది.