రవిబాబు 'ఆవిరి' ఫస్ట్‌లుక్.. ఈ సారి మరింత డిఫెరెంట్‌గా!
విభిన్న చిత్రాలకు చిరునామా డైరెక్టర్ రవిబాబు. సిల్వర్ స్క్రీన్ పై కనిపించడంలో అయినా, మెగా ఫోన్ పట్టి సినిమా రూపొందించడంలో అయినా రవిబాబు రూటే సపరేటు. కెరీర్ ప్రారంభం నుంచే ఓ డిఫెరెంట్ అభిరుచి కలిగిన దర్శకుడిగా, మంచి టెక్నీషియన్‌గా గుర్తింపు పొందాడు రవిబాబు.
అల్లరి, అవును లాంటి డిఫెరెంట్ కథాంశాలను తెరకెక్కించిన ఆయన ఇటీవల పందిపిల్ల ప్రధాన పాత్రలో అదిగో సినిమాను రూపొందించి మిశ్రమ ఫలితం పొందాడు. ఇక తాజాగా 'ఆవిరి' అంటూ మరో డిఫెరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి తాజాగా ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. రవిబాబు స్టైల్ లోనే ఈ సినిమా పోస్టర్ వినూత్నంగా ఉంది. గ్యాస్ పొయ్యి మీద ఉన్న కుక్కర్‌లో అమ్మాయి కళ్లు చూపిస్తూ ఈ పోస్టర్ డిజైన్ చేశారు. చూడటానికి ఎంతో డిఫెరెంట్ గా ఉండటంతో ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది.
ఫ్లయింగ్ ప్రాగ్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో రవిబాబు సహా నేహా చౌహాన్, శ్రీ ముఖ్త తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు దిల్ రాజు సమర్పకుడిగా ఉండటం విశేషం. అతి త్వరలో 'ఆవిరి' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











