Don't Miss!
- Travel వేసవిలో సందర్శించేందుకు దేశంలోని బెస్ట్ ఆఫ్‌బీట్ హిల్ స్టేషన్లు ఇవే..
- News జగన్ Vs పవన్, సమర్ధతకు పరీక్ష - దక్కేదెవరికి..!!
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- Automobiles కారు ప్రియులకు గుడ్‌న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
ఆవిరి.. రిలీజ్ డేట్ ఫిక్స్.. రవిబాబు ఏమన్నాడంటే!
విభిన్న చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్స్ డైరెక్టర్ రవిబాబు. సిల్వర్ స్క్రీన్ పై కనిపించడంలో అయినా, మెగా ఫోన్ పట్టి సినిమా రూపొందించడంలో అయినా రవిబాబు రూటే సపరేటు. కెరీర్ ప్రారంభం నుంచే ఓ డిఫెరెంట్ అభిరుచి కలిగిన దర్శకుడిగా, మంచి టెక్నీషియన్‌గా గుర్తింపు పొందారాయన. ''అల్లరి, నచ్చావులే, అనసూయ, అవును, అవును 2'' లాంటి చిత్రాల ద్వారా తనదైన మార్క్ చూపించారు.
తాజాగా మరో ప్రయోగాత్మక చిత్రం ఆవిరితో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు రవిబాబు. ఫ్లయింగ్ ప్రాగ్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందింది. దిల్ రాజు సమర్పకుడిగా రవిబాబు దర్శకత్వంలోనే తెరకెక్కిన ఈ సినిమాలో రవిబాబు సహా నేహా చౌహాన్, శ్రీ ముఖ్త తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా అప్డేట్స్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించి సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి.
రవిబాబు స్టైల్ లోనే ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల చేశారు. గ్యాస్ పొయ్యి మీద ఉన్న కుక్కర్లో అమ్మాయి కళ్లు చూపిస్తూ ఈ పోస్టర్ డిజైన్ చేయడంతో ఒక్కసారిగా అందరి చూపు ఈ సినిమాపై పడింది. ఆ తర్వాత టీజర్ రిలీజ్ చేసి సినిమా ప్రత్యేకత ఏంటో చెప్పేశారు రవిబాబు. దీంతో ఈ సినిమా విడుదల పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆవిరి చిత్రాన్ని అక్టోబర్ 18 వ తేదీన విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు రవిబాబు.
రీసెంట్గా విడుదలైన ఈ సినిమా టీజర్‌కు ప్రేక్షకుల నుండి చాలా మంచి రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉందని రవిబాబు అన్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మా చిత్రాన్ని అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందకు తీసుకువస్తున్నామని, ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను మెప్పించేలా, థ్రిల్లింగ్‌గా ఉంటుందని ఆయన చెప్పారు. దీంతో ఆవిరి సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయింది.