twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆవిరి.. రిలీజ్ డేట్ ఫిక్స్.. రవిబాబు ఏమన్నాడంటే!

    |

    విభిన్న చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్స్ డైరెక్టర్ రవిబాబు. సిల్వర్ స్క్రీన్ పై కనిపించడంలో అయినా, మెగా ఫోన్ పట్టి సినిమా రూపొందించడంలో అయినా రవిబాబు రూటే సపరేటు. కెరీర్ ప్రారంభం నుంచే ఓ డిఫెరెంట్ అభిరుచి కలిగిన దర్శకుడిగా, మంచి టెక్నీషియన్‌గా గుర్తింపు పొందారాయన. ''అల్ల‌రి, న‌చ్చావులే, అన‌సూయ‌, అవును, అవును 2'' లాంటి చిత్రాల ద్వారా త‌న‌దైన మార్క్ చూపించారు.

    తాజాగా మరో ప్రయోగాత్మక చిత్రం ఆవిరితో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు రవిబాబు. ఫ్లయింగ్ ప్రాగ్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందింది. దిల్ రాజు సమర్పకుడిగా రవిబాబు దర్శకత్వంలోనే తెరకెక్కిన ఈ సినిమాలో రవిబాబు సహా నేహా చౌహాన్, శ్రీ ముఖ్త తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా అప్‌డేట్స్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించి సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి.

    Ravi Babus Aaviri Release Date Fixed

    రవిబాబు స్టైల్ లోనే ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల చేశారు. గ్యాస్‌ పొయ్యి మీద ఉన్న కుక్కర్‌లో అమ్మాయి కళ్లు చూపిస్తూ ఈ పోస్టర్ డిజైన్ చేయడంతో ఒక్కసారిగా అందరి చూపు ఈ సినిమాపై పడింది. ఆ తర్వాత టీజర్ రిలీజ్ చేసి సినిమా ప్రత్యేకత ఏంటో చెప్పేశారు రవిబాబు. దీంతో ఈ సినిమా విడుదల పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆవిరి చిత్రాన్ని అక్టోబర్ 18 వ తేదీన విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు రవిబాబు.

    రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్‌కు ప్రేక్ష‌కుల నుండి చాలా మంచి రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉందని రవిబాబు అన్నారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న మా చిత్రాన్ని అక్టోబ‌ర్ 18న ప్రేక్షకుల ముంద‌కు తీసుకువ‌స్తున్నామని, ఈ సినిమా త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా, థ్రిల్లింగ్‌గా ఉంటుందని ఆయన చెప్పారు. దీంతో ఆవిరి సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయింది.

    English summary
    Directer Ravi Babu's latest movie Aaviri. This is different concept movie. This movie first look released and creating sensation in social media. Now this movie release date fixed.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X