దడ పుట్టించిన రవిబాబు.. ఆ ఇంట్లో ఆత్మను చూపిస్తూ భయపెట్టేశాడు
విభిన్నకథాంశాలు, హారర్ చిత్రాలకు చిరునామా డైరెక్టర్ రవిబాబు. సిల్వర్ స్క్రీన్ పై కనిపించడంలో అయినా, మెగా ఫోన్ పట్టి సినిమా రూపొందించడంలో అయినా రవిబాబు రూటే సపరేటు. కెరీర్ ప్రారంభం నుంచే ఓ డిఫెరెంట్ అభిరుచి కలిగిన దర్శకుడిగా, మంచి టెక్నీషియన్‌గా గుర్తింపు పొందిన ఆయన మరికొద్ది రోజుల్లో 'ఆవిరి' రూపంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
'ఆవిరి' చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవలే ఫస్ట్‌లుక్ విడుదల చేసి ఆసక్తి రేకెత్తించిన రవిబాబు.. ఇప్పుడు టీజర్ రిలీజ్ చేసి భయపెట్టేశాడు. తాజాగా విడుదలైన ఈ టీజర్ 'ఈ ఇంట్లో రాజ్‌కుమార్ రావు, అతని కుటుంబం నివసిస్తోంది. వారితో పాటు ఓ ఆత్మ కూడా ఉంది. దానిని మీరు కనిపెట్టగలరా..?' అనే టైటిల్స్ తో ప్రారంభమై దడ పుట్టించే సన్నివేశాలతో ఆకట్టుకుంది. హారర్ సినిమా లవర్స్ ని ఆకర్షిస్తూ సినిమాపై హైప్ క్రియేట్ చేసింది.

ఫ్లయింగ్ ప్రాగ్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో రవిబాబు ముఖ్య పాత్ర పోషించగా.. నేహా చౌహాన్, శ్రీ ముఖ్త తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు దిల్ రాజు సమర్పకుడిగా ఉండటం విశేషం. అతి త్వరలో 'ఆవిరి' రూపంలో తెలుగు ప్రేక్షకులను భయపెట్టేందుకు రెడీ అవుతున్నాడు రవిబాబు.
గతంలో అల్లరి, అవును లాంటి డిఫెరెంట్ కథాంశాలను తెరకెక్కించిన రవిబాబు ఇటీవల పందిపిల్ల ప్రధాన పాత్రలో అదిగో సినిమాను రూపొందించి మిశ్రమ ఫలితం పొందాడు. ఇక తాజాగా 'ఆవిరి' అంటూ మరో డిఫెరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.


Click it and Unblock the Notifications











