ఈ సారి దసరా బాక్సాఫీసు రేసులో ఈ పంది పిల్ల కూడా!

By Bojja Kumar

టాలీవుడ్ విభిన్నమైన చిత్రాలు తీసే దర్శకుడు ఎవరు అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది రవిబాబు. నటనలో తనదైన విలక్షణత్వం, దర్శకత్వంలోనూ భిన్నత్వం చాటుతూ సినిమాలు తీస్తున్న ఆయన రెగ్యులర్, రోటీన్ సినిమాలకు భిన్నంగా చేయాలని తపన పడుతుంటారు.

ప్రస్తుతం రవిబాబు పంది పిల్ల ప్రధాన పాత్రలో 'అదుగో' అనే చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం దసరాకు విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Ravi Babus Adhugo releasing on Dussehra

ఇప్పటికే చిత్రం విడుదల కావాల్సి ఉండగా సినిమాకు కీలకమైన గ్రాఫిక్స్ సరైన సమయానికి పూర్తికాకపోవడంతో రిలీజ్ ఆసల్యం అవుతూ వచ్చింది. 3డి యానిమేషన్ సీన్లు, గ్రాఫిక్స్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తాయట. ఈ చిత్రంలో అభిషేక్ వర్మ, నాభ, రవిబాబు, ఉదయ్ భాస్కర్, ఆర్కే, వీరేంద్ర చౌదరి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఇందులో నటిస్తున్న పంది పిల్లను రవిబాబు పెంచుకుంటున్న సంగతి తెలిసిందే. నోట్ల రద్దు సమయంలో ఈ పంది పిల్లతో ఏటీఎం క్యూలో నిల్చుని రవిబాబ అప్పట్లో వార్తల్లోకి ఎక్కారు. తర్వాత ఈ పంది పిల్లతో కలిసి ఫిట్‌నెస్ ఛాలెంజ్, దానికి పల్లు తోముతున్న వీడియోలతో హాట్ టాపిక్ అయ్యారు.

టాలీవుడ్లో పంది పిల్లపై సినిమా రావడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు ఎవరూ తెరకెక్కించని డిఫరెంట్ కాన్సెప్టు కావడంతో ఏం చూపించబోతున్నారో? అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫ్లయింగ్ ప్రాగ్స్ ప్రొడక్షన్స్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X