twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రతి ఒక్కడి ఫోన్‌లో అలాంటి వీడియోలే.. చూపించడానికి ఏమి లేదు: డైరెక్టర్ రవిబాబు షాకింగ్ కామెంట్స్

    |

    సినిమా ఇండస్ట్రీలో కొత్త కంటెంట్ ఏ రేంజ్ లో వస్తుందో అంతకుమించి అడల్ట్, రొమాంటిక్ బోల్డ్ సినిమాలు కూడా ఎన్నో వస్తున్నాయి. అయితే చాలా వరకు అలాంటి సినిమాలు బిగ్ స్క్రీన్ పై పెద్దగా క్లిక్కవ్వడం లేదు. సినిమా కంటెంట్ లో రొమాన్స్ డోస్ ఏ మాత్రం ఎక్కువైనా తేడా వచ్చేస్తోంది. ఇక దర్శకుడు రవిబాబు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో అలాంటి కంటెంట్ పై ఎవరు ఊహించని విధంగా కామెంట్ చేశారు.

     కొత్తగా ఆలోచించే రవిబాబు

    కొత్తగా ఆలోచించే రవిబాబు


    మొదట యాడ్ షూట్ లను డైరెక్ట్ చేసిన రవిబాబు ఆ తరువాత నటుడిగా దర్శకుడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. కథను ఎంచుకోవడంలోనే కొత్తగా ఆలోచించే ఈ దర్శకుడు చాలా వరకు ఓ వర్గం ఆడియెన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్నాడు. మొదటి సినిమా అల్లరితో నరేష్ కు బోల్డ్ హిట్ ఇచ్చాడు.

     ఆ సినిమలతోనే మంచి క్రేజ్..

    ఆ సినిమలతోనే మంచి క్రేజ్..


    ఆ తరువాత అనసూయ, నచ్చావులే, అమరావతి, అవును వంటి డిఫరెంట్ సినిమాలతో తన స్థాయిని మరింత పెంచుకున్నాడు. టెక్నీగల్ గా సినిమాను హై రేంజ్ లో నిలబెట్టడంలో రవిబాబు ది బెస్ట్ అనిపించుకున్నారు. కానీ ఈ మధ్య కాలంలో రవిబాబు సినిమాలు అనుకున్నంత రేంజ్ లో క్లిక్కవడం లేదు. అయినప్పటికీ రవిబాబు తన డిఫరెంట్ స్టైల్ ను మార్చడం లేదు.

    ప్రతి ఒక్కడి ఫోన్ లో అలాంటి వీడియోలు

    ప్రతి ఒక్కడి ఫోన్ లో అలాంటి వీడియోలు

    నెక్స్ట్ క్రష్ అనే సినిమాతో రాబోతున్న రవిబాబు అందులో అడల్ట్ కంటెంట్ డోస్ పెంచినట్లు టాక్ గట్టిగానే వస్తోంది. ఇక అలాంటి సినిమాలు ఎందుకు తీస్తారు అనే విషయంపై తనదైన శైలిలో వివరణ ఇచ్చారు రవిబాబు. తాను కొత్తగా సెక్స్ , పార్న్ వీడియోలను ఏమి చూపించాలని అనుకోవడం లేదని ప్రతి ఒక్కడి ఫోన్ లో 40GB స్టోరేజ్ ఉంటే.. అందులో 20GB పార్న్ వీడియోలు ఉంటాయని అన్నారు.

     క్రష్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన రవిబాబు

    క్రష్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన రవిబాబు


    ఈ రోజుల్లో అలాంటి వాళ్ళకు కొత్తగా చూపించాల్సినది ఏమి లేదు. క్రష్ సినిమా అనేది అడల్ట్ కంటెంట్ తో నిండిపోయింది అనేది అవాస్తవం. ఒక స్టోరీని మాత్రమే నేను ప్రజెంట్ చేయాలని అనుకుంటున్నాను. క్రష్ కథలో ముగ్గురు కుర్రాళ్ళ పర్సనల్ లైఫ్ భావాలను మాత్రమే చూపించడం జరిగింది. ట్రైలర్ లో ముందుగా సాఫ్ట్ రొమాంటిక్ సీన్లు చూపించి... తీరా థియేటర్ లో సినిమా చూసిన అనంతరం ఇది ఇలాంటి సినిమానా అని ప్రేక్షకుడు ఏ మాత్రం అనుకోకూడదని.. అందుకే ఎలాంటి సినిమా తీశామనే దానిపై ముందే క్లారిటీ ఇవ్వాలని టీజర్ ను అలా కట్ చేసినట్లు వివరణ ఇచ్చారు రవిబాబు.

    English summary
    Adult and romantic bold movies are coming a long way as new content comes in the film industry. But for the most part such movies do not click big on the big screen. No matter how much the dose of romance in the movie content makes a difference. And in a recent interview, director Ravi Babu unexpectedly commented on such content.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X