డూప్ లేనిదే ఫైట్‌కి రారు.... తెలుగు హీరోలపై స్టార్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

తెలుగు చిత్ర పరిశ్రమలో క్రైమ్, హార్రర్, కామెడీ, రొమాంటిక్ ఇలా అన్ని జోనర్స్‌లో సినిమాలు తీయగల దర్శకులు అరుదు. ఈ కోవలోకే వస్తారు రవిబాబు. సీనియర్ నటుడు చలపతిరావు నటవారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన తొలుత నటుడిగా, కమెడియన్‌గా, విలన్‌గా తర్వాత దర్శకుడిగా, నిర్మాతగా సేవలందించారు. వెరైటీ జోనర్స్‌లో సినిమాలు తీస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన నటించి, దర్శకత్వం వహించిన మూవీ రేజర్.. మే 8న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

2002లో అల్లరి సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన రవిబాబు.. ఆ తర్వాత అమ్మాయిలు అబ్బాయిలు, సోగ్గాడు, అనసూయ, నచ్చావులే, అమరావతి, మనసారా, నువ్విలా, అవును, లడ్డూబాబు, అవును 2, ఆవిరి, క్రష్ తదితర సినిమాలకు దర్శకత్వం వహించారు. తాజాగా ఆయన దర్శకత్వంలో రేజర్ మూవీని తెరకెక్కించారు. తనీష్, బెనర్జీ తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించగా.. చరణ్ మాధవనేని సినిమాటోగ్రాఫర్‌గా, ఎస్ఎస్ రాజేష్ సంగీత దర్శకత్వం వహించారు. తాజాగా రేజర్ మూవీకి సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ పంచుకున్నారు రవిబాబు.

Ravi Babu Slams Use of Body Doubles in Telugu Heroes for Action Scenes

సినిమాలంటే నాకు చిన్నప్పటి నుంచి పిచ్చి. నచ్చిన సినిమాను చాలాసార్లు చూసేవాడిని. ఎంటర్ ది డ్రాగన్ సినిమాను ఎన్నిసార్లు చూశానో లెక్కే లేదు. మద్రాస్‌లోని ఒక థియేటర్‌లో ఉదయం మార్నింగ్ షోకి కూర్చోంటే రాత్రి సెకండ్ షో తర్వాతే బయటకు వచ్చేవాడిని. సినీరంగానికి గోల్డెన్ పీరియడ్ అంటే 1960, 70, 80 దశకాలే. ఆంధ్రప్రదేశ్‌లో ఉండే ప్రజలకు సినిమా ఆర్టిస్టులు కనిపించేవారు. ఎందుకంటే అందరూ మద్రాస్‌లో ఉండేవారు. ఎప్పుడైతే మనకి ఒకటి కనిపించడం లేదో అది మనకి మిస్టరీగా, ఇంట్రెస్ట్‌గా ఉండేది. అదే మనకి రోజూ బయట కనిపించి, టీవీలలో కనిపించి, ఫోన్‌లో కనిపిస్తే దాని మీద ఇంట్రెస్ట్ ఏం ఉంటుంది. పబ్లిసిటీ పేరుతో మనం దానిని ఇంకా ఎక్కువ చేస్తున్నాం. అందుకు జనంలో ఇంట్రెస్ట్ తగ్గిందని రవిబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

నేను ఎక్కువగా కొత్త వాళ్లతోనే తీస్తాను. అందువల్లే చాలా సినిమాలు కూడా హిట్ అయ్యాయి. మనం స్టార్స్‌తో సినిమాలు చేసేది మొదటి మూడు రోజులు ఓపెనింగ్స్ కోసం. మంచి కథల్ని స్టార్స్‌తో తీయలేం.. ఆ స్టార్‌తో షూట్ అయ్యే సినిమాలే తీయగలం. యాక్షన్ సినిమా చేయాలని నా మైండ్‌లో ఉండేది. ఇండస్ట్రీలో ఇప్పటి వరకు చూసిన యాక్షన్ సినిమాలన్నీ కనెక్ట్ కాలేదు. అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ఒక కారు ఛేజ్ జరుగుతుందంటే నువ్వు నమ్ముతావు. ఎందుకంటే అక్కడ నిజంగా జరుగుతూనే ఉంటాయి. అలాంటివి ఇండియాలో జరుగుతాయా? కానీ మన సినిమాల్లో మాత్రం బీభత్సమైన ఛేజ్‌లు ఉంటాయి. అలాగే ఇండియాలో సీరియల్ కిల్లర్స్ ఉండరు.. అక్కడ సందుకొకడు ఉంటాడు అని రవిబాబు తెలిపారు.

హీరో విలన్ ఇంటికొస్తే అక్కడంతా విలన్ మనుషులే ఉన్నారు. అక్కడ ఓ పెద్ద డైలాగ్‌తో వార్నింగ్ ఇచ్చి స్లో మోషన్‌తో నడిచి వెళ్లిపోతాడు. ఇలాంటి కథల్ని నేను హీరోలకు చెప్పలేను. అందుకే నాకు నచ్చిన సినిమాలు నేను చేసుకుంటూ వెళ్లిపోతాను. రేజర్‌లో నాకొక మిడిల్ ఏజ్ క్యారెక్టర్ కావాలి. ఈ రోల్‌కి ఇండస్ట్రీలో వెతికితే నాకంటే పెద్దవాళ్లు ఉన్నారు.. లేదంటే నాకన్నా చిన్నవాళ్లు ఉన్నారు. నాలాగా ఉండి, నా ఫిట్‌నెస్ ఉండి.. కొంతవరకు నాలాగా పర్ఫార్మ్ చేసేవాళ్లు నాకు కనిపించలేదు అని రవిబాబు అన్నారు.

ఇందులో మార్షల్ ఆర్ట్స్, కొన్ని కిక్ ఫైట్స్ కంపోజ్ చేశాం. ఇలాంటివి మనదగ్గర ఎవరూ చేయలేరు. ఎందుకంటే 90 శాతం తెలుగు హీరోలు డూప్స్‌తోనే ఫైట్స్ చేస్తారు. ఈ సినిమాలో ఒక్క రోప్ షాట్ కూడా ఉండకూడదు, అన్నీ రియల్‌గా ఉండాలి. ఎవరు చేస్తారా అని ఆలోచిస్తే నేనే ఎందుకు ఈ పాత్ర చేయకూడదు అనుకున్నా. రేజర్ కోసం ఏడాది క్రితమే మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకున్నా. మనం ఈ సినిమా చేయగలమా? లేదా? అని ఒక్క ఫైట్ సీన్ తీశాం, లేదంటే ఇక్కడితో ఆపేద్దామని అనుకున్నా. ధైర్యం చేసి ఫైట్ సీన్ చేసి చూస్తే అప్పుడు నమ్మకం వచ్చిందని రవిబాబు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు తెలుగు చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతున్నాయి.

Read more about: ravi babu tollywood news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X