బిగ్ బాస్ హౌస్‌లో సెకండ్ పార్టిసిపెంట్ రవికృష్ణ..
గత రెండు సీజన్లు సాఫీగా సాగిన బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ మూడో సీజన్ విషయంలో మాత్రం వివాదాల్లో ఇరుక్కుంది. షో ప్రారంభానికి ముందే ఈ షో బ్యాన్ చేయాలంటూ పలు అవాంతరాలు ఎదురయ్యాయి. శ్వేతా రెడ్డి, గాయత్రీ గుప్తా లాంటి వారి ఆరోపణలు, ఓయూ జెఏసి నిరసనలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ వాటన్నింటినీ అధిగమించి బిగ్ బాస్ షో అట్టహాసంగా ప్రారంభమైంది.
100 రోజుల పాటి నిర్విరామంగా జరగనున్న ఈ షోకి హోస్ట్ గా నాగార్జున వ్యవహరిస్తున్నాడు. ముందుగా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన ఆయన పార్టిసిపెంట్స్ ఒక్కొక్కరినీ బిగ్ బాస్ హౌస్ లోకి ఆహ్వానిస్తున్నారు. మొత్తం 15 మంది కంటిస్టెంట్లు పాల్గొననున్న ఈ రియాలిటీ షోలో సెకండ్ పార్టిసిపెంట్ రవికృష్ణ అడుగు పెట్టారు. బిగ్ బాస్ హౌస్ లోకి సాదరంగా ఆహ్వానించిన నాగార్జున రవికృష్ణ గురించి ప్రేక్షకులకు ఇంట్రో ఇచ్చాడు.

రవికృష్ణ.. పలు టీవీ సీరియల్స్ ద్వారా బాగా పాపులారిటీ సంపాదించాడు. బుల్లితెర నటుడిగా మంచి గుర్తింపు ఉంది. బిగ్ బాస్ లోకి సెకండ్ పార్టిసిపెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటరైన రవికృష్ణకు సావిత్రి వెల్ కమ్ చెప్పింది.


Click it and Unblock the Notifications











