భార్యకు విడాకులు ఇవ్వకుండానే పెళ్లి.. లవర్‌కు ఖరీదైన గిప్టుతో బయటపడ్డ స్టార్ హీరో అఫైర్

చిత్ర పరిశ్రమలో నటీనటుల మధ్య రిలేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమతో నటించిన వారితో స్టార్స్ ప్రేమలో పడటం, వారితో ఎఫైర్లు నడపం ఎప్పటి నుంచో జరుగుతున్నదే. మరికొందరైతే పెళ్లయి భార్య ఉండగానే మరొకరితో అక్రమ సంబంధాలు పెట్టుకోవడమే, రెండో పెళ్లి చేసుకోవడమో జరిగాయి. తాజాగా ఓ స్టార్ హీరో .. ఓ నటితో రిలేషన్ నడుపుతూ ఆమెకి తాజాగా ఖరీదైన ప్రాపర్టీని గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఈ వివరాల్లోకి వెళితే..

కోలీవుడ్ స్టార్ హీరో రవిమోహన్, నటి, గాయని కెనీషా ఫ్రాన్సీస్‌తో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది వీరిద్దరి వ్యవహారం చిత్ర పరిశ్రమను కుదిపేసింది. కెనీషా ఫ్రాన్సీస్‌తో రవి సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియో తొలుత వైరల్ అయ్యాయి. అప్పుడే వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందని కోలీవుడ్ కోడై కూసింది. ఆ వెంటనే ఓ కార్యక్రమానికి వీరిద్దరూ జంటగా హాజరు కావడంతో రవిమోహన్ - కెనీషాల డేటింగ్ వార్తలకు బలం చేకూరినట్లయ్యింది. ఆ తర్వాత కొద్దిరోజులకే జయం రవి భార్య ఆర్తి రవి వీరి బంధంపై విరుచుకుపడ్డారు.

Ravi Mohan Gifts Costly Goa Property to Rumored Girlfriend Kenishaa Francis Amid Divorce Controversy

కోర్టులో విడాకుల కేసు తేలకుండానే ఆయన మరో నటితో వివాహేతర సంబంధం సాగిస్తున్నాడని ఆరోపించింది. మూడో వ్యక్తి ప్రమేయం వల్ల తమ వైవాహిక బంధం బీటలు వారి అది విడాకులకు దారి తీసిందని చెప్పింది. విడాకులకు సంబంధించి వీరిద్దరూ కోర్టులో వాయిదాలకు సైతం హాజరవుతున్నారు. రవికి అన్ని రకాలుగా అండగా నిలిచానని, కానీ తండ్రిగా, భర్తగా ఆయన ఫెయిల్ అయ్యాడని.. కనీసం తన బిడ్డల్ని సైతం పట్టించుకోవడం లేదని ఆర్ధి మండిపడింది. అటు రవి కూడా ఏ మాత్రం తగ్గకుండా ఆర్తి రవిపై సోషల్ మీడియా ద్వారా విరుచుకుపడ్డాడు.

ఇద్దరూ ఈ విషయంలో కోర్టును ఆశ్రయించడంతో దంపతులు ఒకరిపై ఒకరు పరువు నష్టం కలిగించే పోస్టులను పెట్టొద్దని న్యాయస్థానం ఆదేశించింది. దాంతో ఇద్దరూ ఈ వివాదానికి సంబంధించిన పోస్టులను సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించారు. జయం రవి, ఆర్తి రవికి 17 ఏళ్ల క్రితం వివాహం జరగ్గా.. ఈ దంపతులకు ఆరవ్, అయాన్‌లు సంతానం. వ్యక్తిగతంగా వివాదాలు ఉన్నప్పటికీ రవిమోహన్ తన కెరీర్ పరంగా దూసుకెళ్తున్నారు. ఇటీవల పరాశక్తి సినిమాలో నటించిన ఆయన.. ప్రస్తుతం జీనీ, కరాటే బాబు, బ్రో కోడ్ సినిమాలలో నటిస్తున్నారు. వీటితో పాటు త్వరలోనే మెగా ఫోన్ పట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. స్టార్ కమెడియన్ యోగి బాబు హీరోగా ఆన్ ఆర్డినరీ మ్యాన్ అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ రవిమోహన్ - కెనీషాల బంధం కొనసాగుతూనే ఉంది.

తాజాగా తన ప్రియురాలికి రవిమోహన్ ఖరీదైన గిఫ్ట్ ఇచ్చాడు. రవిమోహన్, కెనీషాలు కలిసి గోవాలో సంయుక్తంగా 40 లక్షల రూపాయల ప్రాపర్టీని కొనుగోలు చేసినట్లుగా కోలీవుడ్‌ మీడియా కోడై కూస్తోంది. దీనికి సంబంధించిన పాత్రలలో రవిమోహన్ తన వివాహ స్థితిని.. అన్ మ్యారీడ్ అని పేర్కొనడం చర్చనీయాంశమైంది. ఆర్తి రవితో విడాకుల ప్రక్రియ కోర్టులో కొనసాగుతుండగానే .. న్యాయస్థానం విడాకులు మంజూరు చేయకుండానే ఆయన తనను తాను అవివాహితుడు అని పేర్కొనడం వివాదాస్పదమవుతోంది. దీనిపై నెటిజన్లు మండిపడుతుండగా.. మరికొందరు మాత్రం రిజిస్ట్రేషన్ సమయంలో సిబ్బంది చేసిన పొరపాటు వల్ల రవిమోహన్ పక్కన ఇలా అన్‌ మ్యారీడ్ అనే ఆప్షన్ వచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ వివాదంపై క్లారిటీ రావాలంటే రవిమోహన్, కెనీషాలలో ఒకరు స్పందించాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X