మత్తు వదలరా జోష్‌తో.. సుకుమార్‌తో మరో సినిమా.. మైత్రీ నిర్మాతల క్లారిటీ

మత్తువదలరా విషయంలో కథ బాగుంది సినిమా తీద్ధాం అని నిర్ణయం తీసుకోవడం తప్పితే ఈ రోజు సినిమా విజయంలో మా అఛీవ్‌మెంట్ ఏమీ లేదు. పూర్తి క్రెడిట్ దర్శకుడితో పాటు మిగతా చిత్రబృందానిదే. ఈ విజయం ఇచ్చిన స్ఫూర్తితో చిన్న సినిమాల్ని ప్రోత్సహించే ఆలోచనలో ఉన్నాం. కొత్త కథలు వింటున్నాం. ఔత్సాహికులైన నవతరం ఇండస్ట్రీకి వస్తేనే మంచి సినిమాలు వస్తాయి అంటున్నారు నిర్మాతలు రవిశంకర్, చెర్రి (చిరంజీవి).

మైత్రీ మూవీ మేకర్స్ అండ్ క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన చిత్రం మత్తువదలరా. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలతో పాటు అనూహ్య ప్రేక్షకాదరణ లభిస్తోంది. పరిమిత వ్యయంతో, ఓ వినూత్నమైన ఈ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

Ravi Shankar, Chiranjeevi: after Mathu Vadalara, making movie with Sukumar

ఈ సందర్భంగా నిర్మాతలు రవిశంకర్, చెర్రి(చిరంజీవి) మీడియాతో మాట్లాడుతూ.... కథ బాగుంది సినిమా తీద్ధాం అని నిర్ణయం తీసుకోవడం తప్పితే సినిమాలో మా అఛీవ్‌మెంట్ ఏమీ లేదు. పూర్తి క్రెడిట్ దర్శకుడితో పాటు మిగతా చిత్రబృందానిదే. ఈ విజయం ఇచ్చిన స్ఫూర్తితో చిన్న సినిమాల్ని ప్రోత్సహించే ఆలోచనలో ఉన్నాం. కొత్త కథలు వింటున్నాం. ఔత్సాహికులైన నవతరం ఇండస్ట్రీకి వస్తేనే మంచి సినిమాలు వస్తాయి అని తెలిపారు.

నూతన తారాగణంతో సుకుమార్ రైటింగ్స్ భాగస్వామ్యంలో ఉప్పెన సినిమాను తెరకెక్కిస్తున్నాం. ఏప్రిల్‌లో సినిమాను విడుదలచేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. రెండు పాటలు బ్యాలెన్స్‌గా ఉన్నాయి. సుకుమార్ సినిమా చూసి అవుట్‌పుట్ బాగుందని మెచ్చుకున్నారు. విజయ్ సేతుపతితో పాటు కొంతమంది నటులు మినహా మిగతా వారందరూ కొత్తవాళ్లే సినిమాలో కనిపిస్తారు. భవిష్యత్‌లో మైత్రీ మూవీస్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు ఇలాంటి ప్రతిభావంతులైన యంగ్ టాలెంట్‌డ్‌ను ప్రోత్సాహించాలని నిర్ణయించుకున్నాం అని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X