రవితేజ బలుపు కాంబో రిపీట్.. మళ్ళీ అదే హీరోయిన్‌తో రొమాన్స్
జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్టులకు కమిట్ అవుతున్నాడు మాస్ మాహారాజా రవితేజ. ఒకప్పుడు సూపర్ డూపర్ హిట్ సినిమాలతో బాక్సాఫీస్ షేక్ చేసిన ఆయన.. కొంత కాలంగా ఆ జోష్ చూపలేకపోతున్నాడు. అయినప్పటికీ ఏ మాత్రం వెనకడుగేయకుండా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే దీపావళి కానుకగా రవితేజ 66వ సినిమా కన్ఫర్మ్ చేశారు.
కమర్షియల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. అయితే తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌ని ఫైనల్ చేసింది చిత్రయూనిట్. రవితేజ సరసన అందాల భామ శృతి హాసన్‌ని హీరోయిన్‌గా తీసుకున్నారు. గతంలో కూడా రవితేజ- శృతి హాసన్ జంటగా బలుపు సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. మళ్ళీ అదే కాంబినేషన్ రిపీట్ చేయబోతున్నారు మేకర్స్.

మరోవైపు డాన్‌శీను, బలుపు చిత్రాల తర్వాత రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్ సినిమా ఇదే కావడంతో ఒకింత హైప్ నెలకొంది. అందునా హీరోయిన్ శృతి హాసన్ అని చెప్పడం జనాల్లో ఆసక్తికర అంశంగా మారింది. 2017 సంవత్సరం తర్వాత తెలుగు తెరపై కనిపించని శృతిహాసన్ మళ్ళీ ఇప్పుడు వస్తుండటం ప్రేక్షకుల్లో ఆత్రుత నింపుతోంది.
ఈ చిత్రంలో రవితేజ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించనున్నాడు. ఠాకూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవంబర్‌లో సినిమాను గ్రాండ్‌గా ప్రారంభించనున్నారు. చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్. ఇక ప్రస్తుతం వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతోన్న డిస్కో రాజా సినిమాతో బిజీగా ఉన్నాడు రవితేజ. డిసెంబర్ నెలలో ఈ సినిమా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











