RT4GM: హ్యాట్రిక్ ఇచ్చిన డైరెక్టర్‌తో రవితేజ.. ఆ మూవీకి సీక్వెల్‌గా వస్తుందా!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఏ స్టార్ హీరోకూ సాధ్యం కాని విధంగా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు మాస్ మహారాజా రవితేజ ఒకడు. గత ఏడాది ఆరంభంలోనే భారీ డిజాస్టర్లను చవి చూసిన అతడు.. 'ధమాకా' చిత్రంతో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు.

ఈ ఉత్సాహంతోనే ఆ వెంటనే మెగాస్టార్ చిరంజీవితో కలిసి చేసిన 'వాల్తేరు వీరయ్య' సినిమాలో నటించాడు. ఈ చిత్రం కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే, ఇటీవలే రవితేజ 'రావణాసుర' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ, ఈ సినిమా మాత్రం నిరాశ పరిచింది.

Ravi Teja and Gopichand Malineni 4th Movie Announced

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం 'టైగర్ నాగేశ్వర్రావు' అనే సినిమాలో నటిస్తోన్నాడు. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. దీనితో పాటు ఈ మాస్ హీరో 'ఈగల్' అనే మరో క్రైమ్ థ్రిల్లర్ మూవీలోనూ నటిస్తోన్నాడు.

ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కూడా వేగంగానే జరుగుతోంది. ఇలా చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న రవితేజ ఇప్పుడు తన కొత్త సినిమాను ప్రకటించాడు. దీన్ని గతంలో తనకు హ్యాట్రిక్ విజయాలను అందించిన గోపీచంద్ మలినేనితో చేయబోతున్నాడు.

'డాన్ శ్రీను', 'బలుపు', 'క్రాక్' వంటి వరుస హిట్లను అందించిన గోపీచంద్ మలినేనితో మాస్ మహారాజా రవితేజ సినిమా చేయబోతున్నాడు. తాజాగా దీనికి సంబంధించిన ప్రకటన వెలువడింది. RT4GM అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఇందులో చుండూరు అనే ఊరిలో అగ్నికి ఆహుతి అవుతున్న ఇళ్లను చూపించారు. అలాగే, డేంజర్ అనే బోర్డును కూడా ఉంచారు. దీంతో ఈ సినిమా ప్రకటన సమయంలోనే అంచనాలను ఏర్పరచుకుందని చెప్పాలి.

Ravi Teja and Gopichand Malineni 4th Movie Announced

మాస్ మహారాజా రవితేజ - గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవిశంకర్, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు. దీనికి థమన్ సంగీతాన్ని అందించబోతున్నాడు. ఇక, ఈ చిత్రం 'క్రాక్'కు సీక్వెల్‌గా వస్తుందా? వేరే కథతో రాబోతుందా? అన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X