Mr Bachchan: ఫేవరెట్ హీరో పేరుతో రవితేజ సినిమా.. హరీశ్ ఏం సర్‌ప్రైజ్ చేశాడుగా!
తెలుగు చిత్ర పరిశ్రమలో వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న హీరోల్లో మాస్ మహారాజా రవితేజ ఒకడు. కెరీర్ ఆరంభం నుంచీ హిట్లు ఫ్లాపులను ఏమాత్రం బేరీజు వేసుకోకుండా వెళ్తోన్న అతడు.. తన రేంజ్‌ను పెంచుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఈ ఏడాది రెండు చిత్రాలతో వచ్చిన రవితేజకు నిరాశే ఎదురైన విషయం తెలిసిందే.
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం 'ఈగల్' అనే సినిమాలో నటిస్తోన్నాడు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందుతోన్న ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ దాదాపుగా పూర్తైపోయింది. మిగిలిన భాగాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ చిత్రాన్ని సంక్రాంతి బరిలో నిలపబోతున్నారు. దీని తర్వాత గోపీచంద్ మలినేనితో సినిమా ప్రకటించినా.. అది అనుకోకుండా ఆగిపోయింది.

గోపీచంద్ మలినేనితో చేయాల్సిన సినిమా క్యాన్సిల్ అవడంతో రవితేజ తన 74వ మూవీని స్టైలిష్ డైరెక్టర్ హరీశ్ శంకర్‌తో చేయబోతున్నట్లు ప్రకటన వచ్చింది. దీంతో ఆరంభంలోనే ఈ మూవీపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అంతేకాదు, దీన్ని హిందీలో సూపర్ డూపర్ హిట్ అయిన 'రైడ్' మూవీకి రీమేక్‌గా తెరకెక్కిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఎన్నో రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. దీనికి 'మిస్టర్ బచ్చన్' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ పోస్టర్‌లో రవితేజ స్కూటర్‌పై కూర్చిన ఉండగా.. బ్యాగ్రౌండ్‌లో అమితాబ్ బచ్చన్ పోస్టర్‌ను ముఖం లేకుండా పెట్టారు.

మాస్ మహారాజా రవితేజకు మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అంటే ఎంత ఇష్టమో తెలిసిందే. ఇప్పుడు అదే పేరుతో అతడు సినిమా చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ఇక, ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఈరోజే జరుగుతాయని తెలుస్తోంది. అలాగే, ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం అయ్యే అవకాశం ఉందని సమాచారం.
రవితేజ - హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో రాబోతున్న 'మిస్టర్ బచ్చన్' మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. దీనికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఆమె పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.


Click it and Unblock the Notifications











