EAGLE Postpone: వెనుకడుగు వాళ్ల బాగు కోసమే.. రవితేజ ఆసక్తికర వ్యాఖ్యలు

టాలీవుడ్‌లో సంక్రాంతి సీజన్ ఎంతో ముఖ్యమైనది అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే అప్పుడు సినిమాను విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలతో పాటు హీరోలు కూడా ఉత్సాహం చూపిస్తుంటారు. అలా ప్రతి ఏడాది పొంగల్ సీజన్‌లో ఐదు సినిమాలైనా విడుదల అవుతుంటాయి. అయితే, ఈ ఏడాది మాత్రం తెలుగులోనే ఏకంగా ఐదు సినిమాలో బరిలో నిలిచాయి.

2024 సంక్రాంతికి మహేశ్ బాబు 'గుంటూరు కారం', తేజా సజ్జా 'హనుమాన్' మూవీలు జనవరి 12న విడుదల కాబోతున్నాయి. అలాగే, వెంకటేష్ 'సైంధవ్', రవితేజ 'ఈగల్' మూవీలు జనవరి 13న రాబోతున్నట్లు ప్రకటన వచ్చింది. అంతేకాదు, జనవరి 14 'నా సామిరంగ' విడుదల కాబోతుంది. దీంతో థియేటర్ల సంఖ్య విషయంలో చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

Ravi Teja and Producers Announces EAGLE Movie New Release Date

సంక్రాంతి రిలీజ్‌ల విషయంలో ఇబ్బందులు తలెత్తడంతో సినిమా పెద్దలు కూడా రంగంలోకి దిగి ఎన్నో రకాలుగా మంతనాలు జరిపారు. ఈ నేపథ్యంలోనే కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రవితేజ నటించిన 'ఈగల్' మూవీని వాయిదా వేయాలని చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకుంది. తాజాగా దీన్ని అటు హీరో రవితేజ, ఇటు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.

'ఈగల్' మూవీని ఫిబ్రవరి 9వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు తాజాగా మాస్ మహారాజా అనౌన్స్ చేశాడు. ఈ మేరకు సోషల్ మీడియా ఖాతాల్లో 'మన తెలుగు సినిమా సంక్షేమం కోసం ఒక అడుగు వెనక్కి వేస్తున్నాను. షాట్, టార్గెట్ రావడంలో కొద్దిగా మార్పు. ఈగల్ ఫిబ్రవరి 9న రాబోతుంది. ఈ సంక్రాంతికి రాబోతున్న అన్ని సినిమాలకూ శుభాకాంక్షలు' అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Ravi Teja and Producers Announces EAGLE Movie New Release Date

'ఈగల్' మూవీ నిర్మాతలు 'బాగు కోసం బరిలో రద్దీ తగ్గించాం.. మొండోడు మనసు పుట్ట తేనే. తన నిర్మాత, పరిశ్రమ బాగు కోసం బరిని సంక్రాంతి నుంచి ఫిబ్రవరికి తీసుకొచ్చాడు. అందరూ చూడాల్సి జనరంజకమైన సినిమాను ప్రదర్శించడానికి అంతే మొత్తంలో థియేటర్లు కావాల్సి ఉంటుంది. దర్శకుడు మొదలుకొని సృజనాత్మక సిబ్బంది పనిని ప్రేక్షకులు చూసి మెచ్చుకోవడానికి ఒక ఖరకులేని వేదిక, సమయం కావాలి. వీటిని దృష్టిలో ఉంచుకునే రద్దీని తగ్గించాం. మారింది తేదీ మాత్రమే.. మాసోడి మార్క్ కాదు' అని ప్రకటన వదిలారు.

ఇదిలా ఉండగా.. 'ఈగల్' సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిబొట్ల సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దీనికి Davzand సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో నవదీప్, శ్రీనివాస్ అవసరాల, కావ్య తాపర్, మధు బాల సహా ఎంతో మంది ప్రముఖులు నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X