Don't Miss!
- News ఓటర్లను బెదిరించిన డీకేపై ఎఫ్ఐఆర్, అయ్యా అలా అనలేదని హైకోర్టులో పిటిషన్, అపార్ట్ మెంట్ లో ?
- Finance IT News: రిక్రూట్మెంట్ రూటు మార్చిన ఇన్ఫోసిస్.. టాటా Elxsi న్యూ హైరింగ్..
- Lifestyle May Day 2024 Wishes : శ్రామికులు లేనిదే అభివృద్ధి లేదు.. శ్రామికుల దినోత్సవ శుభాకాంక్షలు
- Sports ధోనీకి కోపం వచ్చింది.. భయపడిన కెమెరామెన్ Video
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
రవితేజకు తప్పని షాక్.. ఓటీటీ రిలీజ్కు క్రాక్
లాక్డౌన్ పరిస్థితులు తెలుగు సినిమా పరిశ్రమను అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే పూర్తయిన సినిమాలు రిలీజ్కు నోచుకోకపోవడంతో నిర్మాత, దర్శకులు ఒత్తిడికి లోనవుతున్నారు. సినిమా హాళ్లు ఎప్పుడు తెరుస్తారేమో అనే నమ్మకం లేకపోవడంతో తమ సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేసే విషయంపై దృష్టిపెడుతున్నారు. లాక్డౌన్లో ఇప్పటికే 47 డేస్, కృష్ణ అండ్ లీలా, అమృతరామం లాంటి చిత్రాలను ఓటీటీలో రిలీజ్ చేశారు. ఈ క్రమంలో రవితేజ, శృతిహాసన్ నటించిన క్రాక్ సినిమాను ఓటీటీపై రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
ఒకవేళ థియేటర్లలో ప్రదర్శనలకు అనుమతులు ఇప్పట్లో రాకపోతే క్రాక్ సినిమాను ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాలనే యూనిట్ ఆలోచనకు రవితేజ సానుకూలంగా ఉన్నారనే విషయం సినీవర్గాల్లో చర్చనీయాంశమైంది. దీంతో నిర్మాత మధు ఇప్పటికే ఓటీటీ సంస్థలతో సంప్రదింపులు, చర్చలు జరిపినట్టు సమాచారం. ఇంకా చర్చలు ముగిసిన వెంటనే అధికారికంగా రిలీజ్ డేట్, ఓటీటీ పేరును ప్రకటించాలని నిర్ణయం తీసుకొన్నారు.
రవితేజతో డాన్ శ్రీను, బలుపు లాంటి చిత్రాలకు అందించిన గోపిచంద్ మలినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, సముద్రఖని, అలీ, దేవీ ప్రసాద్, చిరాగ్ జానీ, మౌర్యాని సుధాకర్, వంశీ చాగంటి కీలక పాత్రల్లో నటించారు. సంగీతం దర్శకత్వం తమన్ వహించగా.. సినిమాటోగ్రఫి బాధ్యతలను జీకే విష్ణు నిర్వహించారు.
ఇదిలా ఉండగా, క్రాక్ సినిమాను తమిళంలో రీమేక్ చేసే ప్రయత్నాలు జోరందుకున్నాయి. విజయ్ సేతుపతి హీరోగా ఈ సినిమాను తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తమిళంలో కూడా శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తారని టాక్.