అమ్మని.. అక్కని.. చెల్లిని తీస్తారా ... రవితేజ మాస్ జాతర సాంగ్‌పై దారుణంగా ట్రోలింగ్
మాస్ మహారాజా రవితేజ ఇటీవలి కాలంలో ట్రోలర్స్‌కు ఎక్కువగా దొరికిపోతున్నారు. అసలే వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న ఈ అగ్రనటుడిని వివాదాలు వెంటాడుతున్నాయి. మరీ ముఖ్యంగా హీరోయిన్లతో వయసు అంతరం, కూతురు వయసు భామలతో రొమాన్స్‌పై ఆయనను ట్రోలర్స్ విమర్శిస్తున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న మాస్ జాతర సినిమాలోని సాంగ్‌పై దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..
రవితేజ వయసుపై ట్రోలింగ్
గతేడాది హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టర్ బచ్చన్‌లో తన కూతురు వయసున్న హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేతో రవితేజ రొమాన్స్ చేయడాన్ని కొందరు తప్పుబట్టారు. రొమాంటిక్ సీన్స్‌తో పాటు ఓ పాటలో భాగ్యశ్రీ పిరుదులపై రవితేజ చేతులు వేసి వాయించడం దుమారం రేపింది. హీరో హీరోయిన్లతో పాటు దర్శకుడు హరీష్ శంకర్, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్‌లపై ఓ రేంజ్‌లో విమర్శలు గుప్పించారు నెటిజన్లు. తాజాగా మరోసారి ట్రోలర్స్‌కు దొరికిపోయారు మాస్ మహారాజా.

మాస్ జాతర చిత్రంపై ఆశలు
దాదాపు మూడు దశాబ్ధాలకు పైగా ప్రేక్షకులను అలరిస్తున్న మాస్ మహారాజా రవితేజ కెరీర్‌లో మాస్ జాతర 75వ సినిమా. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా.. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రవితేజ, శ్రీలీల కాంబినేషన్‌లో వస్తోన్న రెండో సినిమా ఇది. గతంలో వీరిద్దరూ నటించిన ధమాకా చిత్రం ఘన విజయం సాధించడంతో పాటు శ్రీలీల కెరీర్‌కు గట్టి పునాదులు ఏర్పరిచింది.
ఓలే ఓలే సాంగ్‌తో రచ్చ
మాస్ జాతర చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై హైప్ తీసుకొచ్చేందుకు గాను మాస్ జాతర నుంచి మాస్ సాంగ్‌ను వదిలారు. ఉత్తరాంధ్ర టచ్‌లో ఉన్న ఓలే ఓలే సాంగ్‌కు భాస్కర్ యాదవ్ దాసరి లిరిక్స్ అందించారు. స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫిని కంపోజ్ చేశారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించడంతో పాటు రోహిన్ సొర్రాట్‌తో కలిసి ఆలపించారు. 60 ఏళ్లకు దగ్గరవుతున్న రవితేజ తన ఫుల్ ఎనర్జీని చూపించగా.. ఎప్పటిలాగే శ్రీలీల తన స్టెప్పులతో దుమ్మురేపింది.
పాటనిండా బూతులేనంటూ ట్రోలింగ్
ఈ పాటకు మాస్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. రిలీజైన కాసేపటికే యూట్యూబ్‌లో ఓలే ఓలే సాంగ్ టాప్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. అయితే గతంలో ధమాకాలోని పల్సర్ బైక్ మాదిరిగా లేదనే విమర్శలు కూడా లేకపోలేదు. అదే సమయంలో ట్రోలింగ్ కూడా మొదలైంది. మరీ ముఖ్యంగా అమ్మని, అక్కని, చెల్లిని తీస్తారా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. పాట వినడానికి బాగానే ఉన్నప్పటికీ బూతులు నిండిపోయాయని కామెంట్స్ పెడుతున్నారు. సోషల్ మీడియాలో లిరిక్స్ మార్చాలంటూ దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. మరి దీనిపై హీరో రవితేజ, చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. అసలే వరుస ఫ్లాపుల్లో ఉన్న రవితేజ ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. అలాంటి వేళ ఇలాంటి ట్రోలింగ్ ఆయన అభిమానులను కలవరపాటుకు గురిచేస్తోంది


Click it and Unblock the Notifications











