రవితేజ మరో ప్రయోగం.. చేదు అనుభవం తర్వాత కూడా మాస్ మహారాజా..
ఛాలెంజింగ్ పాత్రలను స్వీకరించడం, ప్రయోగాలతో కూడిన సినిమాల్లో నటించడానికి మాస్ మహారాజ్ రవితేజ ఎప్పుడూ ముందుంటాడు. రాజా ది గ్రేట్ చిత్రంలో గుడ్డివాడిగా నటించాలని తీసుకొన్న నిర్ణయం సినీ వర్గాలను షాక్ గురిచేసింది. అయితే ఆ సినిమా చూసిన తర్వాత రవితేజ నిర్ణయం కరెక్టే అనిపించింది. అయితే గత చిత్ర అమర్ అక్బర్ ఆంథోని మాత్రం రవితేజకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. అయితే తాజాగా మరో ప్రయోగానికి రవితేజ్ సిద్ధమవుతున్నట్టు ఫిలింనగర్‌లో ఓ వార్త విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది. వివరాల్లోకి వెళితే..
సక్సెస్ ఫుల్ దర్శకుడు వీఐ ఆనంద్‌తో కలిసి డిస్కో రాజా అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారట. అయితే అపరిచితుడి మాదిరిగా ఓ డిజార్డర్‌తో బాధపడే పాత్రలో ఒదిగిపోయేందుకు ప్రయత్నిస్తున్నారట. తనకున్న సమస్య ఆధారంగానే సినిమా కథ నడుస్తుందనేది తాజా సమాచారం. అయితే డిస్కో రాజా పూర్తి అవుట్ అండ్ అవుట్ కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగుతుందని సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో యాక్షన్, ఎమోషన్స్‌కు కూడా పెద్ద పీట వేసినట్టు తెలుస్తున్నది.

ప్రస్తుతం డిస్కోరాజా చిత్రం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉంది. త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సారి గ్యారెంటీగా భారీ సక్సెస్ కొట్టాలనే దిశగా మాస్ మహారాజా అడుగులేస్తున్నట్టు తెలుస్తున్నది.


Click it and Unblock the Notifications











