ముప్పై రోజులకే ఏకంగా అన్ని కోట్లా: రవితేజ డిమాండ్ మామూలుగా లేదుగా

క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్‌ను ఆరంభించి.. ఆ తర్వాత హీరోగా మారాడు మాస్ మహారాజా రవితేజ. కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాలను అందుకున్న అతడు.. స్టార్‌గా ఎదిగిపోయాడు. అదే సమయంలో బీ, సీ సెంటర్ల ప్రేక్షకులను మెప్పించే సినిమాలతో మాస్ హీరోగా పేరొందాడు. ఇలా జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇక, ఈ ఏడాది 'క్రాక్' మూవీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్న రవితేజ.. ఆ వెంటనే 'ఖిలాడీ' అనే సినిమాను పట్టాలెక్కించేశాడు. ఇది షూటింగ్ జరుగుతుండగానే మరో చిత్రాన్ని ప్రకటించాడీ సీనియర్ హీరో.

టాలెంటెడ్ డైరెక్టర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ ఓ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా కోసం రవితేజ 30 రోజులు కాల్షీట్స్ కేటాయించాడని తెలిసింది. ఇందుకు గానూ రూ. 8 కోట్ల రెమ్యూనరేషన్‌గా అందుకుంటున్నాడట. అంతేకాదు, ఉత్తరాంధ్ర హక్కుల్లో వాటాను కూడా డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి చిత్ర నిర్మాతలు పచ్చజెండా ఊపేశారని అంటున్నారు. అంటే మొత్తంగా రూ. 10 కోట్ల వరకూ చార్జ్ చేస్తున్నాడన్న మాట.

Ravi Teja Charge Huge Remuneration for Trinadha Rao Nakkina Movie

RT68గా రూపొందనున్న ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్‌తో పాటు యంగ్ హీరోయిన్ శ్రీ లీలా ఫీమేల్ లీడ్స్‌గా చేస్తున్నారు. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అది కూడా తండ్రీ కొడుకుల పాత్రలు అని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి 'చంటబ్బాయి' అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X