Dhamaka: రవితేజ-శ్రీలీల డ్యాన్సుకు ఫిదా.. 'పల్సర్ బైక్' సాంగ్ కొత్త రికార్డ్
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా మాస్ మహారాజగా పేరు తెచ్చుకున్నాడు రవితేజ. హిట్లు, ప్లాప్ లు అనే తేడా ఏం లేకుండా వరుస పెట్టి సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రవితేజ రావణాసురతో ఓటమి చవిచూశాడు. ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు సినిమాతో బిజిగా ఉన్నాడు. అయితే గతేడాది విడుదలైన ధమాకా సినిమా ఎలాంటి హిట్ అందుకుందో తెలిసిందే. ఇందులో సాంగ్స్ మాస్ ఆడియెన్స్ ను ఉర్రూతలూగించాయి. అయితే ఇందులో పల్సర్ బైక్ తాజాగా ఓ రికార్డ్ క్రియేట్ చేసింది.
మాస్ మహరాజా రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన చిత్రం 'ధమాకా'. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వ ప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. పెళ్లి సందD సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీలా ఈ మూవీలో హీరోయిన్‌గా నటించింది. జయరాం, సచిన్ ఖేడ్కర్, రావు రమేష్, తణికెళ్ల భరణి వంటి తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించారు. ఈ సినిమాలో కామెడీ స్కిట్స్ ను జబర్ధస్త్ కమెడియన్ హైపర్ ఆదితో రాయించారని తెలిసిందే.

మాస్ మహారాజా రవితేజ డబుల్ ట్రీట్ తో వచ్చిన ఈ ధమాకా చిత్రం ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్టైనర్ గా డిసెంబర్ 23న గ్రాండ్ గా విడుదలైంది. మొదట మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా తర్వాత భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. రూ. 40 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా రూ. 100 కోట్ల క్లబ్ లో చేరి ఆశ్చర్యపరిచింది. ఇక ఇందులో రవితేజ అటు మాస్, ఇటు క్లాస్ నటన ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. అలాగే ముద్దుగుమ్మ శ్రీలీల నటనకు, ఆమె వేసిన స్టెప్పులకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అందుకే మూవీ అన్ని కోట్ల్ కలెక్ట్ చేయగలిగింది.
అయితే ధమాకా సినిమా విడుదలకు ముందు నుంచే మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమాలోని పాటలకు భారీ స్పందన వచ్చింది. అందులో ముఖ్యంగా చూడబుద్దైతాంది రాజీగో పల్సర్ బైక్ పాటలు. వీటిలో పల్సర్ బైక్ పాట తాజాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సాంగ్ యూట్యూబ్ లో దుమ్ము లేపుతోంది.
తాజాగా యూట్యూబ్ లో పల్సర్ బైక్ పాటకు 100 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డ్ సృష్టించినట్లు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇలా మూవీ విడుదలైన ఇన్ని రోజులకు కూడా పాట యూట్యూబ్ లో ట్రెండ్ అవ్వడం విశేషంగా మారింది. ఈ పాటకు జానకి రావు, రమణ లిరికిస్ అందించగా మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ ఆలపించారు.


Click it and Unblock the Notifications











