Dhamaka Mass Cracker: రవితేజ ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్.. హిట్ కళ కనిపిస్తుందిగా!
ఏమాత్రం బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి ప్రవేశించి.. మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసి.. ఆ తర్వాత సోలో హీరోగా మారాడు రవితేజ. అలా ఆరంభంలోనే ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న అతడు స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నాడు. అదే సమయంలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కూడా సంపాదించుకున్నాడు. మరీ ముఖ్యంగా బీ, సీ సెంటర్ల ప్రేక్షకులను అలరిస్తూ మాస్ మహారాజా అన్న బిరుదును అందుకున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తోన్నాడు. అయితే, ఈ మధ్య కాలంలో రవితేజ సక్సెస్‌లకు దూరంగా ఉంటున్నాడు.
'క్రాక్' వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత వరుస ఫ్లాపులతో సతమతం అవుతోన్న రవితేజ.. ఇప్పుడు 'ధమాకా' అనే సినిమాలో నటిస్తున్నాడు. కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా పేరొందిన త్రినాథరావు నక్కిన ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో రవితేజ మార్క్ టైమింగ్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్‌ను కూడా చూపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాక సంబంధించిన షూటింగ్ దాదాపుగా పూర్తైంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టాలని చూస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ మూవీ నుంచి తాజాగా మాస్ క్రాకర్ పేరుతో ఓ టీజర్‌ను విడుదల చేశారు.
తాజాగా విడుదలైన 'ధమాకా' మూవీ టీజర్‌లో రవితేజ అల్ట్రా స్టైలిష్ లుక్‌తో దర్శనమిచ్చాడు. అంతేకాదు, ఇందులో తనదైన బాడీ లాంగ్వేజ్, డైలాగులను పలికించి ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్‌ను అందించాడు. మరీ ముఖ్యంగా ఈ వీడియోలో విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. అలాగే, వన్ లైన్ కామెడీ పంచులు కూడా ఉన్నాయి. మొత్తంగా దీనివల్ల సినిమాకు హిట్ కళ కనిపిస్తుందని చెప్పొచ్చు. ఫలితంగా ఈ సినిమాపై టీజర్‌తో అంచనాలు పెరిగిపోయాయి.

రవితేజ - త్రినాథరావు నక్కిన కాంబినేషన్‌లో రాబోతున్న 'ధమాకా' సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వ ప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 'పెళ్లిసందD' ఫేం శ్రీలీలా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. భీమ్స్ దీనికి సంగీతం అందిస్తున్నారు. ఇందులో జయరాం, సచిన్ ఖేడ్కర్, రావు రమేష్, తణికెళ్ల భరణి, చిరాగ్ జైన్, అలీ, ప్రవీణ్, హైపర్ ఆది తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











