రవితేజ కమ్ బ్యాక్.. కేక పుట్టిస్తోన్న టీజర్

నటుడిగా చిన్న చిన్న పాత్రలను చేస్తూ స్టార్ హీరో రేంజ్‌కు దూసుకుపోయాడు రవితేజ. మాస్ సినిమాలకు, హీరోయిజానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన రవితేజకు ప్రస్తుతం టైమ్ కలిసి రావడం లేదు. ఒక హిట్ కొడితే మూడు ఫ్లాపులన్నట్లు మారింది. రాజా ది గ్రేట్ తరువాత మరో హిట్ కొట్టలేకపోయాడు రవితేజ. అమర్ అక్బర్ ఆంటోని, నేల టికెట్ అంటూ డిజాస్టర్ చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం వీఐ ఆనంద్ దర్శకత్వంలో డిస్కో రాజా చేస్తోన్న సంగతి తెలిసిందే.

మ్యానరిజంతో అదరగొట్టిన రవితేజ..

మ్యానరిజంతో అదరగొట్టిన రవితేజ..

టీజర్ ఆరంభంలో షర్టు పైన వేసుకున్న కోట్ తీసి అవతల పారేసి.. స్టైల్‌గా సిగరెట్ తాగుతూ.. మందు గ్లాసును మరింత స్టైల్‌గా తిప్పుతూ..‘అ యామ్ డన్ విత్ ది ఫ** క్రాప్' అంటూ రవితేజ తన స్టైల్లో చెప్పి ఆసక్తిని రేకెత్తించాడు. ఆపై కొన్ని యాక్షన్ సీన్స్.. ‘మెడిసిన్ ఈజ్ ఛేంజింగ్ ది వెరీ నేచర్ ఆఫ్ నేచర్'బ్యాక్ గ్రౌండ్‌లో వాయిస్ అదిరిపోయింది.

మెడికల్ స్కామ్..

మరో సీన్లో ‘మనం ఈ ప్రాజెక్ట్ చెయ్యకూడదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఆల్రెడీ మనకి వార్నింగ్ ఇచ్చింది' అంటూ తన బాస్ తో చెప్పడం చూస్తే ఏదో చేయకూడని పనినే చేస్తోన్నట్లు తెలుస్తోంది. ‘వీడైతే నో రికార్డ్స్.. నో రిపోర్ట్స్.. నో రిలేటివ్స్.. జీరో రిస్క్.. వుయ్ ఆర్ గోయింగ్ టు బీ గాడ్స్' అంటూ మరో డైలాగ్‌తో ఈ ఉచ్చులో రవితేజ చిక్కుక్కున్నట్లు తెలుస్తోంది.

అదే కథా..?

అదే కథా..?

మెడికల్ రీసెర్చ్ చుట్టూ తిరిగే కథ అని టీజర్ చూస్తేనే అర్థమవుతోంది. వీళ్ల చేసే పనికి మెడికల్ అసోసియేషన్ అనుమతి ఉండకపోవడం.. ఇలాంటి రీసెర్చ్ కోసం ఏకంగా హీరోనే ఎంచుకోవడం చూస్తుంటే.. సైంటిస్ట్‌ల పని పట్టడానికే రవితేజ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది.

ఆకట్టుకున్న యాటిట్యూడ్..

ఆకట్టుకున్న యాటిట్యూడ్..

టీజర్ ఎండింగ్‌లో రవితేజ సూటు బూటు వేసుకుని అద్దాలు పెట్టుకుని పాట పాడుతూ ఎంజాయ్ చేయడం.. చుట్టూ గన్నులతో రౌండప్ చేసిన గూండాలు ఉండటం.. స్టైలీష్‌గా అవి వారికే గురి పెట్టేలా చేయడం.. చూస్తూంటే రవితేజ కమ్ బ్యాక్ అనిపించేలా ఉందనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X