twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రవితేజ వినూత్న ప్రయోగం: రెండు సినిమాల్లోనూ ఒకే పాత్రలు.. ఇప్పటి హీరోల్లో రికార్డేనట

    |

    బ్యాగ్రౌండ్ లేకపోయినా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరో రవితేజ. మరీ ముఖ్యంగా బీ, సీ సెంటర్ల ఆడియెన్స్‌ను ఉర్రూతలూగించేలా సినిమాలు చేస్తూ మాస్ మహారాజ్ అనే బిరుదును అందుకున్నాడు. ఇలా చాలా కాలంగా హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు. ఇక, చాలా కాలం పాటు పరాజయాల పరంపరతో ఇబ్బందులు పడ్డాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఏడాది ఆరంభంలో 'క్రాక్' అనే సినిమాతో మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఇది సూపర్ హిట్ టాక్‌తో పాటు రవితేజ కెరీర్‌లోనే అత్యంత ఎక్కువ కలెక్షన్లను కూడా వసూలు చేసి రికార్డులు కొట్టింది.

    రాశీ ఖన్నాకు వింత అనుభవం: ఒంటరిగా ఎలా ఉంటున్నావ్.. నీ లవర్ పేరేంటి అంటూ పిచ్చి పిచ్చి ప్రశ్నలతో!రాశీ ఖన్నాకు వింత అనుభవం: ఒంటరిగా ఎలా ఉంటున్నావ్.. నీ లవర్ పేరేంటి అంటూ పిచ్చి పిచ్చి ప్రశ్నలతో!

    'క్రాక్' మూవీ ఫలితంతో మాంచి ఊపు మీదున్న రవితేజ.. ఆ వెంటనే రమేష్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడీ' అనే సినిమా స్టార్ట్ చేశాడు. సస్పెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాలో రవితేజ డబుల్ రోల్ చేస్తున్నాడు. మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. పెన్‌ స్టూడియోస్‌ సమర్పణలో హవీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్‌ దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు.. ఫస్ట్ గ్లిమ్స్‌కు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. ఇది ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా కోవిడ్ సెకెండ్ వేవ్ కారణంగా పలుమార్లు వాయిదా పడింది.

    Ravi Teja Dual Role in Dhamaka Movie

    పలు కారణాల వల్ల 'ఖిలాడీ' మూవీకి అడ్డంకులు రావడంతో రవితేజ.. శరత్ మందవా అనే దర్శకుడితో 'రామారావు ఆన్ డ్యూటీ' అనే చిత్రాన్ని మొదలెట్టాడు. ఇది కూడా చాలా వరకూ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఇందులో ఈ మాస్ హీరో క్లాస్ రోల్‌ను చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ఓ హింట్ కూడా ఇచ్చేసింది. ఇక, ఈ మూవీ షూటింగ్‌ను కొద్ది రోజుల పాటు ఆపేసి.. మళ్లీ 'ఖిలాడీ'ని పున: ప్రారంభించాడు. ఈ రెండు చిత్రాలు కొద్ది రోజుల్లోనే టాకీ పార్ట్‌ను కంప్లీట్ చేసుకుంటాయి. ఈ నేపథ్యంలో ఈ మాస్ హీరో తన తదుపరి సినిమాను కూడా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

    టాప్ ఉన్నా లేనట్లే సీరియల్ హీరోయిన్ ఘాటు ఫోజులు: వామ్మో మరీ ఇంత దారుణంగా చూపిస్తారా!టాప్ ఉన్నా లేనట్లే సీరియల్ హీరోయిన్ ఘాటు ఫోజులు: వామ్మో మరీ ఇంత దారుణంగా చూపిస్తారా!

    ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు త్రినాథరావు నక్కినతో రవితేజ ఇటీవలే సినిమాను ప్రకటించాడు. దీనికి 'ధమాకా' అనే టైటిల్ పెట్టారు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా దీని గురించి ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ మూవీలో రవితేజ డుయల్ రోల్ చేస్తున్నాడట. ఈ రెండు పాత్రలూ ఎంతో విభిన్నంగా ఉంటాయని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. రవితేజ 'ఖిలాడీ' మూవీలోనూ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అది రాకముందే ఇప్పుడు మరో చిత్రంలోనూ అదే పాత్రలు చేస్తున్నాడు. దీంతో ఇది కూడా రికార్డే అని ఫిలిం నగర్‌లో టాక్ వినిపిస్తోంది.

    ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వ ప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక, ఇందులో నటించే నటీనటుల వివరాలు చిత్ర యూనిట్ రివీల్ చేయలేదు. అయితే, 'పెళ్లిసందD' ఫేం శ్రీలీలా ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

    English summary
    Ravi Teja Now Doing Dhamaka Movie Under Trinadha Rao Nakkina Directions. He Will Play Dual Role in This Movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X