EAGLE: ఒక్క మనిషికి ఇన్ని అవతారాలా? ఆసక్తికరంగా రవితేజ ‘ఈగల్’ వీడియో
స్వయంకృషితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనలోని టాలెంట్లతో స్టార్ హీరోగా ఎదిగాడు రవితేజ. ముఖ్యంగా బీ, సీ సెంటర్ల ఆడియెన్స్‌ను అలరించే చిత్రాలతో మాస్ మహారాజా అన్న బిరుదును సొంతం చేసుకున్నాడు. ఇక, 'ధమాకా'తో వంద కోట్ల క్లబ్‌లో చేరిన ఈ మాస్ హీరో.. ఏకధాటిగా సినిమాలు చేసుకుంటూ వెళ్తోన్నాడు.
ఈ క్రమంలోనే ఇప్పుడు 'టైగర్ నాగేశ్వర్రావు' అనే పాన్ ఇండియా చిత్రాన్ని కూడా చేస్తున్నాడు. ఇది పట్టాలపై ఉండగానే రవితేజ.. టాలెంటెడ్ గాయ్ కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో మరో మూవీని చేస్తున్న విషయం తెలిసిందే.

మాస్ మహారాజా రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తోన్న చిత్రమే 'ఈగల్'. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో రవితేజ పాత్రకు సంబంధించి అదిరిపోయే ఎలివేషన్ ఇచ్చారు.
ముందుగా 'పెయింటర్ కావాలి' అనే ప్రకటనతో మొదలు పెట్టి.. ఆ తర్వాత శత్రువులను ఊచకోత కోసే ఈగల్‌గా రవితేజ దర్శనం ఇచ్చాడు. చేతిలో గన్‌తో కనిపించిన అతడు.. విలన్ గ్యాంగ్‌ను గన్‌తో మట్టుబెట్టినట్లు చూపించారు. ఇక, టైటిల్ డిజైన్ కూడా అదిరిపోయేలా క్రియేట్ చేశారు.
'ఈగల్' టైటిల్ వీడియోలో రవితేజ పాత్రను ప్రత్తి రైతు అని చెప్పడం.. ఆ తర్వాత నవదీప్ 'కొంత మంది చూపు మనిషి ఊపిరి ఎప్పుడు ఆగాలో డిసైడ్ చేసే చూపు' అని ఎలివేట్ చేయడం.. హీరోయిన్ అనుపమ 'ఒక్క మనిషి చుట్టూ ఇన్ని కథలేంటి? ఒక వ్యక్తికి ఇన్ని అవతారాలేంటి' అని అనడం సినిమాపై ఆసక్తిని, అంచనాలను పెంచేసింది. ముఖ్యంగా ఇందులో విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ సూపర్బ్‌గా వచ్చాయి. రవితేజ లుక్ కూడా 'కిక్' స్టైల్‌లో కనిపించింది. మొత్తంగా టైటిల్ అనౌన్స్‌మెంట్‌తోనే 'ఈగల్' అందరి దృష్టినీ లాగేసిందని చెప్పొచ్చు.
'ఈగల్' మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిబొట్ల సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దీనికి Davzand సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో నవదీప్, శ్రీనివాస్ అవసరాల, కావ్య తాపర్, మధు బాల సహా ఎంతో మంది ప్రముఖులు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2024 సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











