మరో డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రవితేజ: ఈ సారి సరికొత్త ప్రయోగానికి రెడీ

వరుస పరాజయాలతో ఇబ్బందులు పడుతోన్న సమయంలో 'క్రాక్'తో భారీ విజయాన్ని అందుకున్నాడు మాస్ మహారాజా రవితేజ. 'డాన్ శీను', 'బలుపు' వంటి సూపర్ డూపర్ హిట్ల తర్వాత గోపీచంద్ మలినేనితో కలిసిన అతడు.. కీలక సమయంలో ఈ మూవీతో హిట్ ట్రాక్ ఎక్కాడు. ఈ సంక్రాంతికి విడుదలైన ఈ మాస్ మసాలా చిత్రం.. మొదటి ఆట నుంచి మంచి టాక్‌ను అందుకుంది. తద్వారా కలెక్షన్లనూ భారీగానే అందుకుంది. ఫలితంగా రవితేజను సంక్రాంతి రేసులో విజేతగా నిలిచేలా చేసింది. ఈ మూవీ విజయం ఇచ్చిన జోష్‌లోనే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాడాయన.

'క్రాక్' విజయంతో ఉత్సాహంగా ఉన్న మాస్ మహారాజా.. ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడీ' అనే సినిమా చేస్తున్నాడు. సస్పెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాలో రవితేజ డబుల్ రోల్ చేస్తున్నాడు. మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. పెన్‌ స్టూడియోస్‌ సమర్పణలో హవీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్‌ దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు.. ఫస్ట్ గ్లిమ్స్‌కు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. ఇక, ఈ సినిమాను మే 28న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవలే ప్రకటించింది.

 Ravi Teja Green Signal to Trinadha Rao Nakkina

ఇది పట్టాలపై ఉండగానే రవితేజ.. ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు త్రినాథరావు నక్కిన సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. వాస్తవానికి గతంలోనే వీళ్ల కాంబినేషన్‌లో సినిమా రావాల్సి ఉంది. కానీ, అనివార్య కారణాలతో అది కాస్తా వాయిదా పడుతోంది. ఇప్పుడు మార్చి కల్లా 'ఖిలాడీ' షూటింగ్ పూర్తవుతుంది కాబట్టి రెడీగా ఉన్న త్రినాథరావుతోనే సినిమా చేయాలని రవితేజ భావించాడట. ఇక, ఈ చిత్రంలో అతడు తొలిసారి రొమాంటిక్ లవ్ స్టోరీలో నటించబోతున్నాడని కూడా ప్రచారం జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X