For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌కు రవితేజ గ్రీన్ సిగ్నల్: అదిరిపోయే కథతో క్రేజీ ప్రాజెక్టు

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేసే హీరోల్లో మాస్ మహారాజా ఒకడు. అలాంటి స్టార్‌కు భారీ విజయం దక్కితే అస్సలు తగ్గుతాడా? అవును ఈ ఏడాది ఆరంభంలోనే ఈ మాస్ హీరో 'క్రాక్'తో సూపర్ డూపర్ సక్సెస్‌ను అందుకున్నాడు. ఈ చిత్రంతో హిట్ ట్రాక్ ఎక్కడంతో పాటు కెరీర్‌లోనే భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే అతడు వరుసగా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఇప్పటికే రెండు చిత్రాలను పట్టాలెక్కించేసిన రవితేజ.. ఇప్పుడు మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది.

  'క్రాక్' తర్వాత రవితేజ.. రమేష్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడీ' అనే సినిమాను మొదలు పెట్టాడు. ఇది చాలా వరకూ షూటింగ్ జరుపుకుంది. అయితే, కరోనా సెకెండ్ వేవ్ కారణంగా విదేశాల్లో జరిగే భాగం మాత్రం వాయిదా వేయాల్సి వచ్చింది. దీనికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉండడంతో.. ఈ గ్యాప్‌లో ఇంకో సినిమాను చేయాలని డిసైడ్ అయ్యాడు రవితేజ. ఇందులో భాగంగానే శరత్ మందవా అనే దర్శకుడితో 'రామారావు ఆన్ డ్యూటీ' అనే చిత్రాన్ని మొదలెట్టాడు. ఇది కూడా చాలా వరకూ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. త్వరలోనే ఈ రెండు సినిమాలు టాకీ పార్ట్‌ను కంప్లీట్ చేసుకోబోతున్నాయి.

  ఘాటు ఫొటోలతో రెచ్చిపోయిన హెబ్బా పటేల్: అబ్బా అనిపించేలా ఫోజులు.. మామూలుగా లేవుగా!

  Ravi Teja Green Signal to Venky Kudumula

  ప్రస్తుతం రెండు చిత్రాలు పట్టాల మీద ఉండగానే రవితేజ తాజాగా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరొందిన వెంకీ కుడుములకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. 'ఛలో', 'భీష్మ' వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన అతడు.. విజయం దక్కినా గ్యాప్ తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో తాజాగా మాస్ మహారాజాకు ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ స్టోరీని చెప్పాడట. ఇది అతడికి బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశాడని అంటున్నారు. అలాగే, వెంకీకి దీనికి సంబంధించిన పూర్తి స్క్రిప్టును రాసుకుని సూచించినట్లు కూడా తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఈ యంగ్ డైరెక్టర్ అదే పనిలో ఉన్నాడని సమాచారం.

  ఇక, పూర్తి స్థాయిలో కథను విన్న తర్వాత ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ నిర్మించబోతున్నారని కూడా ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. 'ఖిలాడీ', 'రామారావు ఆన్ డ్యూటీ' పూర్తైన వెంటనే దీన్నే పట్టాలెక్కిస్తారని కూడా ఫిలిం నగర్ ఏరియాలో టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా.. మాస్ మహారాజా రవితేజ స్పీడు చూసిన సినీ పెద్దలంతా షాక్‌కు గురవుతున్నారట. మరోవైపు ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీగా ఉన్నారు.

  English summary
  Mass Maharaj Ravi Teja Now Doing Khiladi and Ramarao On Duty. These Films Directed by Ramesh Varma and Sarath Mandava. After These Movies He Will do a film Under Ramarao On Duty Direction.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X