పాతబస్తిలో రవితేజ ‘డిస్కో’.. ముగ్గురు హీరోయిన్లతో మాస్ మహారాజా
మాస్ మహారాజా రవితేజ, వి ఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మిస్తున్న చిత్రం "డిస్కోరాజా". ఇటీవలే ఈ సినిమా షూటింగ్ రామెజిఫిల్మ్‌సిటి లో మాస్‌మహరాజ్ రవితేజ, వెన్నెల
కిషోర్ ల మద్య కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.తరువాత హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది. రీసెంట్‌గా పాతబస్తీలో చాలా కీలక సన్నివేశాలను హీరో రవితేజ, ఇతర నటీనటుల మధ్య కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ చిత్రంలో RX100 ఫేమ్ పాయల్ రాజ్ పుత్, నన్ను దోచుకుందువటే ఫేమ్ నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

మరో హీరోయిన్ ఎంపిక ఇంకా జరగాల్సి వుంది. టేస్ట్ వున్న నిర్మాత రామ్ తళ్ళూరి ఈ చిత్రాన్ని భారీగా నిర్మించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కి అద్భుతమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. త్వరలో హైదరాబాద్ లో భారీ సెట్ లో మేజర్ షెడ్యూల్ ని ప్రారంభిస్తారు.
డిస్కో రాజా చిత్రంలో రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారట. అయితే అపరిచితుడి మాదిరిగా ఓ డిజార్డర్‌తో బాధపడే పాత్రలో ఒదిగిపోయేందుకు ప్రయత్నిస్తున్నారట. తనకున్న సమస్య ఆధారంగానే సినిమా కథ నడుస్తుందనేది తాజా సమాచారం. అయితే డిస్కో రాజా పూర్తి అవుట్ అండ్ అవుట్ కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగుతుందని సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
నటీనటులు: రవితేజ, పాయల్ రాజపుత్, నభా నటేష్, బాబీసింహా, వెన్నెల కిషోర్, సత్య, సునీల్, రామ్ కి తదితరులు
నిర్మాత: రామ్ తళ్లూరి
దర్శకుడు: విఐ ఆనంద్
సినిమాటోగ్రాఫర్: కార్తిక్ ఘట్టమనేని
డైలాగ్స్: అబ్బూరి రవి
మ్యూజిక్: థమన్
ఎడిటర్: నవీన్ నూలి
బ్యానర్: ఎస్ఆర్‌టి ఎంటర్ టైన్మెంట్స్


Click it and Unblock the Notifications











