Don't Miss!
- Sports PBKS vs MI: నిప్పులు చెరిగిన బుమ్రా.. ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచిన ముంబై ఇండియన్స్!
- News పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
‘ఖిలాడీ’ అప్డేట్.. రవితేజ మరీ ఇంత ఫాస్ట్‌గా ఉన్నాడేంటి!
ఒక్క హిట్ పడితే స్టార్ హీరో ఫేట్ ఎలా మారుతుందో అందరికీ తెలిసిందే. ఫ్లాపు పడితే ఎంత కష్టంగా ఉంటుంది.. ఎన్ని రకాలుగా కామెంట్లు వినిపిస్తాయో.. ఒక్క హిట్ పడితే వాటికి వంద రెట్ల ప్రశంసలు వస్తుంటాయి. వరుస సినిమాలతో రవితేజ డిజాస్టర్లను చవిచూశాడు. అలా ఫ్లాపులు కొడుతూ వస్తున్న రవితేజకు క్రాక్ చిత్రం ఊపిరినిచ్చింది. ఆ క్రాక్ చిత్రం కేవలం రవితేజకు మాత్రమే కాదు.. మాస్ పవర్ ఏంటో చూపించి ఇండస్ట్రీ జనాలకు కొత్త ఊపునిచ్చింది.
కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ఓ సినిమా ఇంతలా కలెక్షన్లు కొట్టగలదా? అనే అనుమానాలను తిప్పి కొట్టింది. సంక్రాంతి పండుగ ముగిసినా కూడా క్రాక్ థియేటర్ల వద్ద రవితేజ అభిమానుల జాతర మాత్రం ముగియడం లేదు. అలా క్రాక్ రూపంలో కెరీర్ బెస్ట్ సినిమాగా మిగిలింది. అలా ఊపులో ఉన్న రవితేజ ఇప్పుడు ఖిలాడీ దుమ్ములేపేందుకు రెడీ అవుతున్నాడు. అసలే మంచి ఉత్సాహంలో ఉన్న రవితేజ తన అభిమానులకు మంచి కిక్కిచ్చే న్యూస్ చెప్పాడు.
జనవరి 26 సందర్భంగా రవితేజ తన ఫ్యాన్స్‌కు అప్డేట్ ఇచ్చాడు. ఖిలాడీ ఫస్ట్ గ్లింప్స్‌ను జనవరి 26న ఉదయం పది గంటల ఎనిమిది నిమిషాలకు రాబోతోందని ప్రకటించారు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రంలో డింపుల్ హయతి, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీని రమేష్ వర్మ తెరకెక్కిస్తున్నాడు. మొత్తానికి రవితేజ సంక్రాంతి సీజన్లో దుమ్ములేపి ఇప్పుడు రిపబ్లిక్ డేను కూడా వదలడం లేదు.