Khiladi First Talk: సెన్సార్ పనులను ముగించుకున్న ఖిలాడి.. సినిమా ఎలా ఉంటుందంటే?

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చాలా కాలం తర్వాత ఒక బిగ్ బడ్జెట్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మాస్ మహారాజా రవితేజ నటించిన ఖిలాడి సినిమాను ఈ నెల 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ అయితే ప్రస్తుతం మంచి క్రేజ్ ను అందుకుంటున్నాయి. తప్పకుండా సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందని కూడా చిత్ర యూనిట్ సభ్యులు నమ్మకంతో వున్నారు. మొత్తానికి ఈ సినిమా సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకుంది మరి సినిమా ఎలా ఉంది అనే వివరాల్లోకి వెళితే...

ఫామ్ లోకి వచ్చిన మాస్ రాజా

ఫామ్ లోకి వచ్చిన మాస్ రాజా

గత ఏడాది క్రాక్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న రవితేజ ఒక్కసారిగా తన మార్కెట్ స్థాయిని కూడా పెంచుకున్నాడు అనే చెప్పాలి. గోపీ చంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 50 కోట్లకు పైగా వసూళ్లను అందుకుని కరోనా కష్టకాలంలో కూడా సినిమా సాధించిన విజయం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాకుండా రవితేజ వరుస పరాజయాల అనంతరం క్రాక్ సినిమాతో ఫాంలోకి వచ్చేసాడు.

ఖిలాడితో సిద్దమైన మాస్ రాజా

ఖిలాడితో సిద్దమైన మాస్ రాజా

ఇక ఇప్పుడు ఖిలాడి సినిమాతో కూడా మంచి విజయాన్ని అందుకోవాలని రవితేజ సిద్ధమయ్యాడు. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పై ప్రస్తుతం పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ లెక్కలు కూడా చర్చనీయాంశంగా మారుతున్నాయి. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని కూడా చెబుతున్నారు. ఈ సినిమాలో రవితేజ రెండు విభిన్నమైన డిఫరెంట్ లుక్స్ తో కనిపించబోతున్నాడు.

సెన్సార్ పనులు పూర్తి

సెన్సార్ పనులు పూర్తి

ఇక మొత్తానికి సినిమాకు సంబంధించిన సెన్సార్ పనులు కూడా ఫినిష్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాను హిందీలో కూడా భారీగా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇక తెలుగులో ఖిలాడి సినిమాకు U/A సర్టిఫికెట్ లభించింది. సెన్సార్ యూనిట్ కూడా సినిమాపై పాజిటివ్ గా స్పందించినట్లు సమాచారం. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు కూడా అద్భుతంగా ఉన్నాయి అని రవితేజ కూడా గతంలో ఎప్పుడూ లేని విధంగా సరికొత్త నటనతో మెప్పించాడు అని అంటున్నారు.

 సినిమా ఎలా ఉందంటే?

సినిమా ఎలా ఉందంటే?

సినిమాలో ఒక ఎపిసోడ్ లో రవితేజ చేసిన యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయని ముఖ్యంగా గన్ ఫైట్స్ కూడా యాక్షన్ ప్రియులకు ఒక సరికొత్త అనుభూతిని ఇస్తాయి అని చెబుతున్నారు. డింపుల్ హయాతి, రవితేజకు కరెక్ట్ గా జోడి అని ఆమె గ్లామర్ ప్రజెంటేషన్ కూడా సినిమాల్లో చాలా హైలెట్గా అయినట్లుగా చెబుతున్నారు. కేవలం యాక్షన్ సన్నివేశాలు మాత్రమే కాకుండా రవితేజ లోని మరో డిఫరెంట్ టైమింగ్ ఈ సినిమాలో బయటపడబోతున్నట్లు సమాచారం.

Recommended Video

Indirect Tweet On Ys Jagan, Tollywood Directors Twitter Battle | Filmibeat Telugu
సెకండాఫ్ లో మరొక విధంగా..

సెకండాఫ్ లో మరొక విధంగా..

ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా సినిమాకు మంచి హైప్ అయితే క్రియేట్ చేశాయి. ఇటీవల కాలంలో విభిన్నమైన సినిమాలు లైన్ లో పెడుతున్న రవితేజ ఖిలాడి సినిమాతో మరింత భిన్నంగా ఆ ఆకట్టుకోబోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రవితేజ ఫస్టాఫ్ లో ఒక విధంగా సెకండాఫ్ లో మరొక విధంగా కనిపిస్తాడట. సినిమాలు క్లైమాక్స్ ఫైట్ సీన్ కూడా అద్భుతంగా ఉంటుందని చెబుతున్నారు. కొన్ని ఎమోషనల్ సీన్స్ ను కూడా దర్శకుడు హార్ట్ టచింగ్ గా తెరకెక్కించినట్లు గా చెబుతున్నారు. మరి సినిమా ఫైనల్ గా వెండితెరపై ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X