అస్సలు తగ్గేదేలేదంటున్న రవితేజ: డేట్‌ కూడా అనౌన్స్ చేసి క్లారిటీ ఇచ్చేశారుగా!

బ్యాగ్రౌండ్ లేకపోయినా స్టార్లుగా ఎదిగిన వాళ్లు తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. అందులో మాస్ మహారాజా రవితేజ ఒకడు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అతడు.. చాలా కాలానికి సోలో హీరోగా మారాడు. ఆ తర్వాత ఎన్నో ఏళ్లు కష్టపడి స్టార్ హీరోగా అవతరించాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకుపోతున్నాడు. హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు రవితేజ. ఇలా ఎన్నో విజయాలను కూడా సొంతం చేసుకున్నాడు. అదే సమయంలో మార్కెట్‌తో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సైతం భారీగా పెంచుకున్నాడు.

కొంత కాలంగా సరైన హిట్ కోసం వేచి చూస్తోన్న మాస్ మహారాజా రవితేజ.. గత ఏడాది సంక్రాంతికి వచ్చిన 'క్రాక్' మూవీతో మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. అంతేకాదు, యాభై శాతం ఆక్యూపెన్సీ ఉన్నా కలెక్షన్లను విశేషంగా రాబట్టాడు. దీంతో ఇది అతడి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ ఉత్సాహంతోనే ఆ వెంటనే రవితేజ 'ఖిలాడీ' అనే సినిమాను మొదలు పెట్టాడు. రమేష్ వర్మ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా పుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. మూవీ షూటింగ్ కరోనా ముందు వరకూ శరవేగంగా సాగుతూ వచ్చింది. సెకెండ్ వేవ్ వచ్చిన తర్వాత విదేశాల్లో జరగాల్సిన షెడ్యూల్‌కు బ్రేక్ పడిపోయింది.

సుదీర్ఘమైన విరామం తర్వాత అంటే కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్‌లో 'ఖిలాడీ' సినిమా షూటింగ్‌ను పున: ప్రారంభించారు. ఈ షెడ్యూల్‌లో కీలకమైన సన్నివేశాలను పూర్తి చేసుకున్నారు. ఇందులోనే విదేశాల్లో చేయాల్సిన షూటింగ్‌ను సైతం ప్రత్యేకమైన సెట్లను నిర్మించి కంప్లీట్ చేశారట. ఇక, ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో 'ఖిలాడీ' మూవీ రిలీజ్ డేట్ గురించి ఎన్నో రకాల వార్తలు సైతం వైరల్ అవుతున్నాయి. దీంతో అసలు ఇది అనుకున్న టైంకు వస్తుందా? రాదా? అని ఫ్యాన్స్ అయోమయానికి గురవుతున్నారు.

Ravi Teja Khiladi Movie Premieres From February 10th

రవితేజ నటించిన 'ఖిలాడీ' మూవీని ఫిబ్రవరి 11న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ వెల్లడించింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమా నుంచి పాటలను ఒక్కొక్కటిగా వదులుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా ప్రీమియర్స్ ఫిబ్రవరి 10న ప్రారంభం అవుతాయని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు ఓవర్సీస్ హక్కులను కొనుగోలు చేసుకున్న ఫ్లైహై సినిమాస్ సంస్థ ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. దీంతో 'ఖిలాడీ' మూవీ ఫిబ్రవరి 11నే ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుందన్న క్లారిటీ వచ్చేసింది. దీంతో రవితేజ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

'ఖిలాడీ' సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిన ఈ మూవీ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రీతిలో స్పందన వచ్చింది. అలాగే, సాంగ్స్ పరంగా మంచి రెస్పాన్స్‌ అందుకుంది. ఇక, ఈ సినిమాను సత్యనారాయణ కోనేరు, రమేష్ వర్మ పెన్మెశ్చ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్, యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X