Don't Miss!
- Sports RCB vs KKR: చెలరేగిన కోహ్లీ, కార్తీక్.. కేకేఆర్ ముందు భారీ లక్ష్యం!
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్‌ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్‌ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ఇవేం రికార్డులు సామీ.. రవితేజ కెరీర్లో ‘క్రాక్’ ది బెస్ట్
మాస్ మహారాజా రవితేజ అభిమానులు ఏం కోరుకుంటారో అలాంటి అంశాలన్నంటిని మేళవించి తీసిన చిత్రమే క్రాక్. మాస్ అండ్ కమర్షియల్ అంశాల మీద పట్టున్న గోపీచంద్ మలినేని మాస్ మహారాజాను ఎలా చూపిస్తాడో అందరికీ తెలిసిందే. డాన్ శీను, బలుపు చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టేశాడు. ఇక మూడో హిట్ కూడా ఖాయమైనట్టు కనిపిస్తోంది. అలా మొదటి హ్యాట్రిక్ కొట్టేలా కనిపిస్తున్నారు.
క్రాక్ ట్రైలర్‌ను నూతన సంవత్సరం సందర్భంగా రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్‌తో రవితేజ తన విశ్వరూపాన్ని చూపించాడు. ఇక ఇందులో రవితేజ చెప్పిన మాస్ డైలాగ్స్, పుచ్చ లేచిపోద్ది.. ఏది కోసేస్తానే నాకే తెలీదు.. వంటి మాస్ అండ్ పవర్ ఫుల్ డైలాగ్‌లతో రవితేజ రెచ్చిపోయాడు. రవిశంకర్, వరలక్ష్మీ నెగెటివ్ రోల్, రవితేజ యాక్షన్ సీక్వెన్స్, శ్రుతీహాసన్ రొమాంటిక్ సీన్స్ ఇలా ప్రతీ ఒక్కటి ఈ ట్రైలర్లో కనిపించింది.
మాస్కు ఫుల్ మీల్స్ పెట్టేలా కనిపిస్తోన్న క్రాక్ ట్రైలర్ యూట్యూబ్‌లో దుమ్ములేపుతోంది. రవితేజ కెరీర్లో అత్యంత వేగంగా పది మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టిన ట్రైలర్‌గా క్రాక్ సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. మొత్తానికి ఫ్లాపుల్లో కొట్టుమిట్టాడుతోన్న రవితేజను క్రాక్ గట్టెక్కించాలనే కనిపిస్తోంది. ఈ సంక్రాంతికి అసలు సిసలైన తెలుగు సినిమా వచ్చేలా ఉందని రవితేజ అభిమానులు సంబరపడిపోతున్నారు.